Health Tips: కొత్తిమీర తింటున్నారా.. అయితే మీకో గుడ్‌న్యూస్

కొత్తిమీరతో కొన్ని సమస్యలన్నింటికి చెక్ పెట్టవచ్చు. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొత్తిమీరలో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, బి, సి వంటి పోషకాలు ఎక్కువ. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

New Update
Coriander: కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి!

కొత్తిమీరను క్రమం తప్పకుండా తింటున్నారా? దీంతో ఈ ప్రాణాంతక వ్యాధికి చెక్ పెట్టొచ్చట అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా అందరిలో రోగనిరోధక శక్తిపై అవగాహన పెరుగుతుంది. కొత్తిమీరలో ఉండే ఆక్సికోడోన్‌ ఫ్రీ రాడికల్స్‌ వల్ల సెల్యులార్‌ నష్టాన్ని తగ్గించి.. టోకోఫెరోల్స్‌ రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కొత్తిమీర మనస్సును, ఆహార రుచిని ఔషధ గుణాలు పెంచుతోంది. కొత్తిమీరకు వాడే ధనియాలు, కొత్తిమీరను రెండింటినీ మనం చేసే వంట్లో ఉపయోగిస్తారు. కొత్తిమీరను పప్పు, మటన్, చికెన్, బిర్యానీ చేయడానికి ఉపయోగిస్తారు. దీనిని చట్నీ చేసుకుని కూడా తినవచ్చు. దీన్ని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

రక్తపోటును తగ్గిస్తోంది

ముఖ్యంగా ఈ మధ్యకాలంలో గుండె జబ్బు ప్రమాదాలు ఎక్కువగా వస్తున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రస్తుతం గుండె సమస్యలు ప్రధానగా మారింది. ఈ తరుణంలో మనం గుండె రక్షణ గురించి ఆలోచించాల్సిన ఉంది. అయితే ఈ కొత్తిమీర డైయూరిటిక్‌గా పనిచేస్తోంది..శరీరంలో సోడియంను బయటకు పంపి రక్తపోటును తగ్గించి చెడు కొలెస్ట్రాల్, ఎల్‌డీఎల్‌ఐని కొత్తిమీర తగ్గిస్తోంది. గుండె, కేన్సర్‌ ఉన్నప్పుడు శరీరంలో మంటను తగ్గించే శక్తి కొత్తిమీరకు ఉంది. ఎందుకంటే, కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కేన్సర్‌ వచ్చినపుడు కొత్తిమీర తింటే.. కణాల అధిక పెరుగుదలను తగ్గించే లేదా మందగించే శక్తి కొత్తిమీరకు ఉంది. దేశంలో అయితే ..కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన తర్వాత ప్రజల్లో రోగనిరోధక శక్తిపై అవగాహన చాలా పెరిగిందనే చెప్పాలి. కొత్తిమీరలో ఉండే ఆక్సికోడోన్‌ ఫ్రీ రాడికల్స్‌ వల్ల సెల్యులార్‌ నష్టాన్ని తగ్గిస్తోంది.

కొత్తిమీర రసం నరాల కణాలు దెబ్బతినకుండా కాపాడుతోంది

టోకోఫెరోల్స్‌ రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంది. రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల డయాబెటీస్‌తో పాటు దుష్ప్రభావాలకు దారితీస్తోంది. కొత్తిమీర గ్లూకోజ్‌ను సమర్థవంతంగా ప్రాసెస్‌ చేయడంలో సహాయపడే ఎంజైమ్‌లను సక్రియం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. అల్జీమర్స్, పార్కిన్సన్స్, మల్లీపుల్‌ స్కెర్లోసిస్‌ వంటి మెదడు వ్యాధులు కొత్తిమీరను తీసుకోవడం ఈ వ్యాధులను నివారించవచ్చు. నరాల కణాలు దెబ్బతినకుండా కొత్తిమీర రసం కాపాడుతుందని ఓ అధ్యయనంలో తేలింది. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి కొత్తిమీర సహాయపడుతోంది. కొత్తిమీర గింజల నూనె ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు ప్రోత్సహిస్తోంది. ఐబీఎస్‌ ఉన్న రోగులకు 30 చుక్కలు కొత్తిమీర మూలిక ఔషధం ఇవ్వడం వల్ల పొత్తికడుపు నొప్పి, ఉబ్బరం, అసౌకర్యంగా ఉంటే వెంటనే తగ్గుతుంది. అంతేకాదు కాలేయ సంబంధిత సమస్యలకు కొత్తిమీర ఉపయోగకరంగా ఉంది. కొత్తిమీర ఆకులలో తగినంత ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్‌ను పిత్త రుగ్మతలు, కామెర్లు వంటి కాలేయ వ్యాధులను దూరం చేస్తుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

రాత్రిపూట వీటిని తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

రాత్రిపూట మసాలా, ఫాస్ట్‌ఫుడ్, బర్గర్‌లు వంటివి తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు, అజీర్ణం, ఊబకాయం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు.

New Update
Foodsareheated5

foods

మారిన జీవనశైలి వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోకుండా మసాలా, ఫాస్ట్‌ఫుడ్ వంటివి ఎక్కువగా తీసుకుంటారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు. ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కొందరు రాత్రిపూట వీటిని ఎక్కువగా తీసుకుంటారు. వీటిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

కడుపులో ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు..

రాత్రిపూట కొన్ని రకాల ఆహార పదార్థాలను అసలు తీసుకోకూడదు. లైట్‌గా ఉండే పదార్థాలను తీసుకోవాలి. కొందరు రాత్రిపూట ఆయిల్, వేయించిన పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు. వీటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటివల్ల కడుపులో ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు ఏర్పడతాయి.

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

వీటితో పాటు మసాలా, కెఫిన్, తక్కువ ఫైబర్ ఆహారాన్ని కూడా రాత్రిపూట తీసుకోకూడదు. వీటివల్ల గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వస్తాయి. రాత్రిపూట కొందరు సోడా, తీపి పదార్థాలు వంటివి తీసుకుంటారు. వీటితో పాటు బర్గర్లు, పిజ్జా, నాన్‌వెజ్ వంటివి ఎక్కువగా తీసుకుంటారు. వీటివల్ల ఊబకాయం, జీర్ణ సమస్యలు వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

Advertisment
Advertisment
Advertisment