Breakfast: వీటిని అల్పాహారంగా తీసుకుంటే కొవ్వు మొత్తం మాయం కొవ్వు మన శరీరంలో లోతుగా పేరుకుని అంతర్గత అవయవాలను చుట్టుముట్టి ఎన్నో రోగాలకు దారి తీస్తుంది. వ్యాయామంతో పాటు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఉదయాన్నే ఆహారంలో ప్రొటీన్లు, పీచుపదార్థాలు, సాంబార్‌తో ఇడ్లీ, ఖిచ్డీ లాంటివి తినడం వల్ల బరువు తగ్గవచ్చు By Vijaya Nimma 08 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Breakfast: శరీరంలో కొవ్వును కరిగించుకోవడం చాలా కష్టమైన పని. వ్యాయామంతో పాటు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. కొవ్వు మన శరీరంలో లోతుగా పేరుకుని అంతర్గత అవయవాలను చుట్టుముట్టి ఎన్నో రోగాలకు దారి తీస్తుంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు. ఉదయాన్నే ఆహారంలో ప్రొటీన్లు, పీచుపదార్థాలు చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అల్పాహారంగా ఏం తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. సాంబార్‌తో ఇడ్లీ: పులియబెట్టిన పప్పు, బియ్యంతో చేసిన ఇడ్లీలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. పప్పు, వివిధ కూరగాయలతో కూడిన పోషకమైన సాంబార్‌తో వాటిని తినడం వల్ల మధ్యాహ్నం వరకు ఆకలి అనిపించదు. కేలరీలు కూడా తగ్గుతాయి. ఖిచ్డీ: గోధుమలు, పప్పులు, కూరగాయలతో ఖిచ్డీని తయారు చేస్తారు. గోధుమలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. పప్పులు ప్రోటీన్ పవర్‌హౌస్. ఈ రెండు పదార్థాలను సీజనల్ వెజిటేబుల్స్‌తో కలిపి తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. పెరుగుతో పనీర్ పరాటా: పనీర్ పరాటాను గోధుమ గింజల నుంచి తయారు చేస్తారు. తక్కువ కొవ్వు ఉన్న పెరుగుతో దీన్ని అల్పాహారంగా తీసుకోవచ్చు. చాట్: దీన్ని సులభంగా తయారు చేయడమే కాకుండా తినడానికి చాలా సౌకర్యవంతంగా, రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలు, టొమాటోలు, సుగంధ ద్రవ్యాలతో మొలకెత్తిన గింజలతో చాట్ చేసుకుని తినవచ్చు. గుడ్లు: గుడ్లలో మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి. గుడ్లు ఆకలిని నియంత్రించడం, కండరాలను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి. కొవ్వును కూడా కరిగిస్తాయి. గ్రీన్ స్మూతీ: పాలకూర, పండ్లు, ప్రోటీన్ పౌడర్‌తో కూడిన గ్రీన్ స్మూతీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి మంచి పోషకాహారాన్ని అందించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది కూడా చదవండి: ఫాల్గుణ అమావాస్య రోజు ఇలా చేశారంటే ఎంతో పుణ్యం గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #breakfast #fat మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి