Breakfast Bread: ప్రతిరోజూ ఉదయం టీ లేదా పాలతో బ్రెడ్ తింటున్నారా..? అయితే వెంటనే ఆపేయండి..!! రోజూ బ్రెడ్ తినడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాల హాని కలుగుతుందని నిపుణులు అంటున్నారు. కొంతమంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో టీ, కాఫీలో బ్రెడ్‌ని తింటూ ఉంటారు. బ్రెడ్ తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. By Vijaya Nimma 18 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Breakfast Bread: చాలా మందికి ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో టీతో బ్రెడ్‌ని తీసుకోవడం అలవాటు. కానీ రోజూ బ్రెడ్ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయట. ప్రస్తుత కాలంలో చాలామంది సమయానికి తినడం అనేది చాలా తక్కువ. అయితే ఇలా తినకపోవడం వల్ల వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌లో చేయడానికి ముందు టీ, కాఫీలో బ్రెడ్‌ని తింటూ ఉంటారు. అయితే ఇలా తినడం అనేది ఆరోగ్యానికి మంచిదా..? కాదా..? అనేది విషయం చాలా మందికి తెలియదు. కానీ నిపుణులు మాత్రం ఇలా తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. టీలో బ్రెడ్ ముంచుకొని తింటే ఏమవుతుందో ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం. టీలో బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌ని తీసువాలి: రోజూ బ్రెడ్ తినడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాల హాని కలుగుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో టీ, పాలతో బ్రెడ్ తినడం అలవాటు.కానీ రోజూ బ్రెడ్ తినడం ఆరోగ్యానికి హానికరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్రెడ్ తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. బ్రెడ్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ వేగంగా పెరిగి ఆపై పడిపోతుంది. దీనివల్ల ఎప్పుడూ అలసిపోతారు. బ్రెడ్ తినడం వల్ల బరువు వేగంగా పెరుగుతుంది. ఎందుకంటే బ్రెడ్, పాలలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే.. చక్కెర లేకుండా పాలు తాగండి. ధాన్యపు రొట్టె తినాలని నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: ఒక నెల పాటు పప్పులు తినడం మానేస్తే ఏం అవుతుందో తెలుసా..? #breakfast-bread మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి