Weight Gain Tips: ఎత్తుకు సరపడ బరువు ఉండాలంటే ఇవి తినండి..

చాలామంది ఎత్తుకు సరిపడ బరువు ఉండక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బరువు పెరగాలంటే ప్రతీరోజూ కొన్ని నానబెట్టిన పల్లీలు, పచ్చికొబ్బరి, మొలకెత్తిన గింజలు, 10 నుంచి15 ఖర్జూర పండ్లుతోపాటు సపోటా అరటిపండు, జామ వంటివి తీసుకుంటే బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

New Update
Weight Gain Tips: ఎత్తుకు సరపడ బరువు ఉండాలంటే ఇవి తినండి..

Weight Gain Tips: చాలామంది ఎత్తుకు తగిన బరువు ఉండకా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది అయితే సన్నగా, కండలు లేకుండా ఎముకలు కనిపిస్తూ ఉంటారు. ఇలా సన్నగా ఉండేవారు బరువు పెరగడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. అంతే కాకుండా వీరు బరువు పెరగడానికి జింక్ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటారు. అలా ఎక్కువగా జింగాఫుడ్‌ తీసుకుంటే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. అయితే.. సన్నగా ఉన్నవారు బరువు పెరగాలి గాని, కొవ్వు పెరగకుండా కండ మాత్రమే పెరిగే ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. చాలా సన్నగా ఉన్నవారు బరువు పెరిగే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. సన్నగా ఉన్నవారు కండ పెరగడానికి మాంసాన్ని ఎక్కువగా తీసుకుంటారు. కానీ.. కొందరికీ ఇలా తీసుకోవడం సాధ్యపడదు. అయితే.. మాంసం మాత్రమే కాకుండా ఇతర ఆహార పదార్థాలు తీసుకుంటే సులువుగా బరువు పెరుగుతారని నా ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

ఖాళీ కడుపుతో నీటిని తాగాలి

తక్కువ ఖర్చుతో.. తక్కువ సమయంలో మంచి ఆహారం తీసుకుంటే సులభంగా బరువు పెరుగుతారు. అయితే.. ఇలా బరువు పెరగాలనుకునే వారికి అరుగుదల మరియు ఆకలి రెండు అధికంగా ఉంటే మంచిది. మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా ఉండాలి. బరువు పెరగాలనుకునేవారు ముందుగా రోజూ ఉద‌యాన్నే ఖాళీ కడుపుతో నీటిని ఎక్కువగా తాగాలి. తర్వాత కొన్ని నానబెట్టిన పల్లీలను తినాలి. తర్వాత పచ్చికొబ్బరి, మొలకెత్తిన గింజలు, 10 నుంచి15 ఖర్జూర పండ్లుతోపాటు సపోటా అరటిపండు, జామ వంటివి తీసుకుంటే మంచిది. ఇలాంటి అల్పాహారం ఎక్కువగా తీసుకుంటే ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి. వీటితోపాటు మధ్యాహ్నం వరకు ఎక్కువ నీటిని తాగుతూ ఉండాలి తప్ప.. మరే ఇతర ఆహార పదార్థాలు తీసుకోకూడదు. తర్వాత మధ్యాహ్నం ముడి బియ్యం, కొర్రల, జొన్న అన్నం వంటివి తీసుకుంటే మంచిది.

Also Read: పిల్లలు మొండిగా ఉంటే ఇలా చేయండి.. నార్మల్‌ ఐపోతారు!

సాయంత్రం ఆరు గంటల తర్వాత పుచ్చగింజల, గుమ్మడి గింజల, బాదం, ప్రొద్దు తిరుగుడు, పిస్తా, జీడిపప్పు వంటివి నానబెట్టుకుని తినాలి. ఈ పప్పులో నాలుగు నుంచి ఐదు రకాల పప్పులు ఉండే విధంగా చూసుకోవాలి. వీటిని తిన్న తర్వాత సపోటా, అరటి, సీతాఫలం, ఎండు ఖర్జూరాలు వంటి పండ్లను తినాలి.అయితే.. మధ్యాహ్నం భోజనంలో 60 శాతం అన్నం, 20% ఆకు కూర పప్పు, 20 శాతం కూరలు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడప్పుడూ మిల్‌మేకర్ కూర, సోయా గింజలు కూరలు తినవచ్చు. ఇలా భోజనం చేసిన తర్వాత సాయంత్రం 6 గంటల వరకు నీటిని తాగుతూనే ఉండాలి.ఇలా.. సాయంత్రం 7 గంటల లోపు డిన్నర్ పూర్తి చేసిన తర్వాత మరుసటి రోజు వరకు ఏమీ తినకుండా ఉండాలి. ఈ విధంగా రోజు మూడు పూటలు ఆహారాలను తింటే మనం చాలా సులభంగా బరువు తగ్గుతామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు