BREAKING: భారత్ లో భారీ భూకంపం! భారత్ లో భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం 5:53 గంటలకు అస్సాంలోని తేజ్‌పూర్‌లో రిక్టర్ స్కేల్‌పై 3.4 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. By V.J Reddy 27 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Earthquake : భారత్ లో గత కొన్ని నెలలుగా వరుస భూకంపాలు(Earthquakes) సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరోసారి భారత్(India) లో భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం 5:53 గంటలకు అస్సాంలోని తేజ్‌పూర్‌లో రిక్టర్ స్కేల్‌పై 3.4 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. ఈ భూకంపంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. కొంత ఆస్థి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. ALSO READ: ఓటుకు రూ.3,000.. మహిళలకు పట్టు చీర! An earthquake of magnitude 3.4 on the Richter Scale hit Assam's Tezpur at 5:53 am today: National Center for Seismology pic.twitter.com/PxEsxI51fq — ANI (@ANI) December 27, 2023 నిన్న (బుధవారం) తెల్లవారు జామున లేహ్ లడఖ్లలో భూకంపం(Earth Quake) సంభవించింది. ఉదయం 4.30 గంటల సమయంలో లేహ లడఖ్ లలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ మీద 4.5గా చూపించింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లో కూడా భూకంపం వచ్చింది. అక్కడ దీని తీవ్రత రిక్టర్ స్కేల్ మీ 3.7గా నమోదయ్యింది. హిమాలయాల్లో కిష్టవర్ లో భూకంపం వచ్చిందని. ఇది జమ్మూ కాశ్మీర్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉందని ఎన్సీఎస్ చెప్పింది. అక్కడ అర్ధరాత్రి 1.10 నిమిషాలకు భూమి కంపించిందని తెలిపింది. అయితే భూకంపం వలన ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని తెలిపింది. కానీ భూమి ఒక్కసారిగా దధ్దరిల్లడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని…భయంలో ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీశారని తెలిపారు. మరోవైపు క్రిస్టమస్ సెలవులు కారణంగా లేహ్-లడఖ్(Leh – Ladakh), జమ్మూ కాశ్మీర్(Jammu & Kashmir), హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) టూరిస్టులతో నిండిపోయాయి. మంచుకురుస్తుండండతో దాన్ని చూసేందుకు పర్యాటకులు బారులు తీరారని చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన సిమ్లా, మనాలి, కులు, కసోల్ వంటి ప్రాంతాల్లో పర్యాటకుల వాహనాలతో రద్దీ నెలకొంది. కేవలం మూడు రోజుల్లోనే వేల సంఖ్యలో వాహనాలు సిమ్లాలోకి ప్రవేశించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోహ్‌తంగ్‌లోని అటల్ సొరంగం గుండా 3 రోజుల్లో 55 వేల కంటే ఎక్కువ వాహనాలు సిమ్లాలోకి ప్రవేశించాయని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకూ గత 24 గంటల వ్యవధిలో 28,210 వాహనాలు అటల్ టన్నెల్ గుండా బయటికి వెళ్లినట్లు చెప్పారు. ఒక వైపు పొగమంచు, మరోవైపు వేల సంఖ్యలో పర్యాటకుల రాకతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ నెలకొంది. ALSO READ: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల.. గిడుగు రుద్రరాజు క్లారిటీ! #breaking-news #earthquake #earthquake-in-india #assam-earthquake మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి