Sachin Tendulkar: బ్యాటే ఆయుధం.. ఆటే ప్రాణం.. దసరా వేళ సచిన్‌ మార్క్‌ 'ఆయుధ పూజ' ఇది!

క్రికెట్‌ను ప్రాణంగా భావించే సచిన్‌.. ఆట పట్ల తనకున్న ప్రేమను మరోసారి చూపించాడు. దసర సందర్భంగా ఆయుధ పూజ వేళ.. 'బ్యాట్‌-బాల్‌' ని దేవత ముందు పెట్టి పూజ చేశాడు సచిన్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. 'బంతి బౌండరీ దాటినట్లే, చెడుపై మంచి సాధించిన విజయం మీ జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తుంది.. సరైన మార్గం కోసం బ్యాటింగ్ చేస్తూ ఉండండి' అని అభిమానులకు మెసేజ్ ఇచ్చాడు క్రికెట్ గాడ్.

New Update
Sachin Tendulkar: బ్యాటే ఆయుధం.. ఆటే ప్రాణం.. దసరా వేళ సచిన్‌ మార్క్‌ 'ఆయుధ పూజ' ఇది!

భారత్‌లో క్రికెట్‌ మతమైతే.. ఆ మతానికి సచిన్ దేవుడు. క్రికెట్‌గాడ్‌గా కేవలం భారతీయులతోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న ఆటగాడు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar). అతను క్రికెట్‌ని వీడి ఇప్పటికీ పదేళ్లు గడుస్తున్నా అభిమానుల మనసుల్లో మాత్రం ఇప్పటికీ సచిన్‌ సచిన్‌లాగే ఉన్నాడు. అతను కనిపిస్తే ఇప్పటికీ 'సచిన్..సచిన్' అంటూ నినాదాలు చేస్తారు ఫ్యాన్స్‌. 24ఏళ్ల పాటు టీమిండియాకు ఆడిన సచిన్‌ ఆటను ఎంత ప్రేమిస్తాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆటనే శ్వాసగా.. బ్యాట్‌నే ఆయుధంగా బతికిన సచిన్‌ తనకు అవకాశం దొరికినప్పుడల్లా క్రికెట్‌పై ప్రేమను చాటుకుంటాడు. తాజాగా మరోసారి అదే చేశాడు. దసరా సందర్భంగా సచిన్‌ చేసిన 'ఆయుధ పూజ' నెట్టింటిని ఊపేస్తోంది.


విజయదశమి వేడుకల్లో భాగంగా తన ఇంట్లో క్రికెట్ బ్యాట్-బాల్‌ను పెట్టి 'ఆయుధ పూజ' చేశాడు సచిన్. తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. అభిమానుల కోసం ఈ విధంగా తన సోషల్ మీడియా అకౌంట్లో మెసేజ్ పోస్ట్ చేశారు. 'బంతి బౌండరీ దాటినట్లే, చెడుపై మంచి సాధించిన విజయం మీ జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తుంది.. సరైన మార్గం కోసం బ్యాటింగ్ చేస్తూ ఉండండి' అంటూ క్యాప్షన్‌ పెట్టాడు క్రికెట్ గాడ్‌.

ఒక గాడ్‌ మరో దేవుడికి పూజ చేస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ సచిన్‌పై ప్రేమను చాటుకున్నారు. 16ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సచిన్‌ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను సృష్టించాడు. వంద సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ సచినే. వన్డే, టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్‌ పేరిట లెక్కలేనన్ని రికార్డులు ఉన్నాయి. నవంబర్‌ 16, 2013న అంతర్జాతీయ క్రికెట్‌కు సచిన్‌ వీడ్కోలు పలికాడు. తన హోం గ్రౌండ్‌లో ముంబైలో జరిగిన ఆ మ్యాచ్‌లో గేమ్‌ ముగిసిన తర్వాత గ్రౌండ్‌ను వీడుతూ పిచ్‌ని ముద్దాడుతూ వీడ్కోలు పలికాడు సచిన్‌. తన కెరీర్‌లో ఎప్పుడూ కూడా బ్యాట్‌ని కిందకేసి కొట్టని సచిన్‌.. ఇప్పుడు దసరా సమయంలోనూ ఆటపై తనకున్న ప్రేమను చూపించాడు.

Also Read: భారీ శరీరంతో మీ మామయ్య ప్రత్యర్థులను ఉతికి ఆరేశాడు.. మీకేమో తిండిగోలా..ఉఫ్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు