Bhadradri Kothagudem : ప్రాణం తీసిన పెన్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం..! భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తలలో పెన్ గుచ్చుకుని సుభాష్ నగర్ కాలనీకి చెందిన చిన్నారి రియాన్షిక చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆడుకుంటుండగా రయాన్షిక చెవి పైభాగంలోపలికి పెన్ చొచ్చుకుపోయింది. సర్జరీ అనంతరం బ్రెయిన్ కు ఇన్ ఫెక్షన్ కావడంతో ప్రాణాలు కోల్పోయింది. By Jyoshna Sappogula 03 Jul 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Khammam : పెన్.. ఓ చిన్నారి ప్రాణం తీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam) పట్టణంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పెన్ గుచ్చుకుని సుభాష్ నగర్ కాలనీకి చెందిన చిన్నారి (Little Girl) రియాన్షిక చికిత్స పొందుతూ మృతి చెందింది. మంచంపై ఆడుకుంటూ కిందపడటంతో రియాన్షిక చెవి పైభాగంలోపలికి పెన్ చొచ్చుకుపోయింది. Also Read: విజయవాడలో దారుణం.. కవలలు మృతి..! తీవ్ర రక్తస్రావం (Bleeding) కావడంతో తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓప్రైవేట్ ఆసుపత్రి (Private Hospital) కి తరలించారు. సర్జరీ అనంతరం బ్రెయిన్ కు ఇన్ ఫెక్షన్ కావడంతో చిన్నారి రియాన్షిక ప్రాణాలొదిలింది. రియాన్షిక మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పాపకోసం 2.50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా చిన్నారి ప్రాణాలు దక్కకపోవడంతో బోరున విలపిస్తున్నారు. #khammam #bhadrachalam #little-girl మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి