Karnataka Liquor: కదిరిలో కర్ణాటక మద్యం కలకలం... భారీగా పట్టుకున్న పోలీసులు

శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. 92 కర్ణాటక మద్యం బాక్సులు పట్టుకున్నట్లు మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీలత వెల్లడించారు.

New Update
Karnataka Liquor: కదిరిలో కర్ణాటక మద్యం కలకలం... భారీగా పట్టుకున్న పోలీసులు

తనకల్లు మండల పరిధిలోని పెద్దపల్లి గ్రామ సమీపంలోని చాకివేలు క్రాస్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు.  పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం బాటిల్స్ తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 92 కర్ణాటక మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కదిరి డీఎస్పీ శ్రీలత (Kadiri DSP Srilatha) తెలిపారు. శుక్రవారం పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐ వెంకటేశ్వర్లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

వాహనం సీజ్

ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కర్ణాటక నుంచి అక్రమ మద్యం సరఫరా చేస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు తమ సిబ్బంది పెద్దపల్లి సమీపంలో దాడులు నిర్వహించారని చెప్పారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తులను వెంబడించగా సతీష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. కాగా.. మరో ముగ్గురు కదిరికి చెందిన కళ్యాణ్ కుమార్, నారాయణస్వామి, మురళి పరార్‌లో ఉన్నట్లు తెలిపారు. అక్రమ మద్యానికి వినియోగించిన వాహనాన్ని సీజ్ చేశామన్నారు. పరార్‌లో ఉన్న వ్యక్తులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించే పరిస్థితి లేదని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పంట పొలాలలో విద్యుత్తు సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవ్

అంతేకాకుండా.. పంట పొలాలలో విద్యుత్ సరఫరా చేసి వ్యక్తులు, వన్యప్రాణాల మృతికి కారణమైతే వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని కదిరి డీఎస్పీ శ్రీలత హెచ్చరించారు. వ్యక్తులు, వన్యప్రాణాలు మృతి చెందితే కారుకులైన వారిపై జైలు శిక్ష తప్పని చెప్పారు. ఇప్పుడు సెలవులు కాబట్టి ఎక్కడైనా పేకాటలు, మద్యం సంబంధించి ఏమైనా జరిగితే.. ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణం తీసింది..చిన్నారి మృతికి బాధ్యత వహించాలి: వంగలపూడి అనిత

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ఏపీలో మరో ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్!

ఏపీలో మరో ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 22న నోటిఫికేషన్ రిలీజ్ చేయనుండగా మే 13లోపు ఈఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.

New Update
EC

AP by-election EC notification released

BIG BREAKING: ఏపీలో మరో ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 22న నోటిఫికేషన్ విడుదలచేసి మే 9న పోలింగ్ జరగనుంది. 

ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

29 వరకు నామినేషన్ల స్వీకరణ..

ఈ మేరకు ఒక రాజ్యసభ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

ఇది కూడా చూడండి: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించనుండగా.. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కించనున్నట్లు తెలిపారు. మొత్తంగా మే 13వ తేదీలోపు ఈఎన్నికల ప్రక్రియ పూర్తికానున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 

ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

 

mp | ap | ec | notification | telugu-news | today telugu news

 

 

Advertisment
Advertisment
Advertisment