/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/hit-n-run-jpg.webp)
Jubilee Hills Hit and Run Case Update: జూబ్లీహిల్స్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగిన యాక్సిడెంట్‌లో ఓ బౌన్సర్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఓ పబ్‌లో పనిచేస్తున్న బౌన్సర్ బైక్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో అతను స్పాట్‌లోనే చనిపోయాడు. అయితే డ్రైవర్ మాత్రం కారు ఆపకుండా స్పీడ్‌గా పొనిచ్చేశాడు. కనపడకుండా పోయాడు. అయితే సీసీ ఫూటేజీ ఆధారంగా కారు డ్రైవర్‌ను గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులోనే అతను ఇలా చేసినట్టు సమాచారం. నిందితుడిని కూకట్‌పల్లికి చెందిన ద్వారంపూడి నాగ గా గుర్తించారు. కారును స్వాధినం చేసుకున్న పోలీసులు నాగ ను ఎస్‌ఆర్ నగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. మద్యం తాగి వాహనం నడిపిన కేసుగా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంలో సిక్కు గ్రామానికి చెందిన తారక రామ్ (31) తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన అతని సహోద్యోగి రాజు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వెళ్తుండగా పెద్దమ్మ గుడి సమీపంలో కారు ఢీకొట్టింది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. పని ముగించుకోని ఇంటికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఐపీసీ సెక్షన్ 304-ఏ (నిర్లక్ష్యం కారణంగా మరణానికి) కింద కేసు నమోదు చేశారు. తారక్ రామ్‌కు ఇటీవలే పెళ్లి జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక నిన్న(జనవరి 24) సాయంత్రం కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
#HitAndRun case in #Hyderabad , recorded in #CCTV :
A bouncer by name Tarak Ram (30), died and another severely injured after a #speedy car hit their bike near Peddamma Temple in Jubilee Hills, in wee hours today and escaped from the spot.#RoadSafety #RoadAccident pic.twitter.com/yw8Gd8x4rt
— Surya Reddy (@jsuryareddy) January 24, 2024
Also Read: 5 ఏళ్ల చిన్నారిని చంపేసిన మూఢ నమ్మకం.. కన్నకొడుకుకే నీటిలో ముంచి హతమర్చిన తల్లిదండ్రులు!
WATCH: