Drugs case: నవదీప్‌ కోసం వేట! నెక్ట్స్ ఏం జరగబోతోంది?

నవదీప్‌ కోసం అధికారుల వెతుకులాట కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని అతని నివాసంపై తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్స్ బ్యూరో దాడులు చేసింది. పోలీసుల సోదాల్లో నవదీప్ ఇంట్లో లేకపోయినా.. ఏజెన్సీ వచ్చిన విషయం తెలుసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ కేసుతో సంబంధం ఉన్న నవదీప్‌ అరెస్ట్‌ నుంచి ఉపశమనం పొందాలని హైకోర్టును ఆశ్రయించగా, ఇవాళ్టి వరకు అనుమతి లభించింది. హైకోర్టు రిలీఫ్ గడువు ముగియడంతో నార్కోటిక్స్ బ్యూరో సోదాలు నిర్వహించింది. దీంతో నవదీప్ మరోసారి డ్రగ్స్ కేసుకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

New Update
Drugs case: నవదీప్‌ కోసం వేట! నెక్ట్స్ ఏం జరగబోతోంది?

Drugs case updates: డ్రగ్స్‌ కేసులో హీరో నవదీప్‌ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. వారం రోజులుగా నవదీప్‌ పరారీలో ఉన్నాడు. ఇవాళ్టి(సెప్టెంబర్ 19) వరకు నవదీప్‌ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.. నవదీప్‌ మరోసారి కోర్టును ఆశ్రయించనున్నారు. అటు నార్కోటిక్ బ్యూరో పోలీసులు కౌంటర్‌ దాఖలు చేసింది. నవదీప్ పిటిషన్‌ను రేపు(సెప్టెంబర్ 20) హైకోర్టు విచారించనుంది. నవదీప్‌ మిత్రుడు రామ చందు ఇప్పటికే అరెస్ట్‌ అయ్యారు. రామ చందు దగ్గర నవదీప్‌ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలున్నాయి.

నవదీప్‌ ఎక్కడ:
ఈ నెల 16న పోలిసులు నవదీప్‌ ఇంటికి వెళ్లగా.. ఆ సమయంలో అతను అక్కడ లేరు. మాదాపూర్ డ్రగ్స్ కేస్‌లో నిందితుడిగా నవ దీప్‌ను చూపెట్టింది నార్కోటిక్ బ్యూరో. అంతేకాకుండా, నవదీప్ ఇంతకుముందు డ్రగ్స్ కేసులో పట్టుబడిన వ్యక్తుల నుంచి మాదకద్రవ్యాలను కొనుగోలు చేసేవాడని తెలిపే అతనిపై బలమైన 'సాక్ష్యం' లభించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎన్‌డిపిఎస్ చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 120 ఆఫ్ 2023కి సంబంధించి నవదీప్‌ పట్టుబట్టాడు.

అసలేం జరిగింది?
మాజీ ఎంపీ, సినీ దర్శకుడి కుమారుడు సహా ఎనిమిది మందిని తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్స్ నిరోధక శాఖ (టీఎస్‌ఎన్‌ఏబీ) ఇప్పటికే అరెస్టు చేసింది. వారి నుంచి 50 గ్రాముల ఎండీఎంఏ, 24 ఎక్స్‌టసీ మాత్రలు, ఎనిమిది గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో మాజీ ఎంపీ డి.విట్టల్‌రావు కుమారుడు దేవరకొండ సురేశ్‌రావు, సినీ దర్శకుడు అనుగు సుశాంత్‌రెడ్డి, నైజీరియన్ పెడ్లర్లు అమోబి చుక్వుడి మూనాగోలు, ఇగ్‌బావ్రే మైఖేల్, థామస్ అనగ కలు ఉన్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్, టీఎస్‌ఎన్‌ఏబీ డైరెక్టర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్, సినీ నిర్మాత రవి ఉప్పలపాటి పేర్లు కూడా ఉండగా కానీ పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. 2017లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద కేసుకు సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ అండ్‌ ప్రొహిబిషన్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించిన టాలీవుడ్ ప్రముఖులలో నవదీప్ కూడా ఉన్నాడు.

ALSO READ: ‘రజాకార్‌’ సినిమా బ్యాన్‌? ముదురుతున్న వివాదం..!

Advertisment
Advertisment
తాజా కథనాలు