Mastan Sai: తిక్కరేగితే అందరిని ఇరికిస్తా.. మస్తాన్ ఫోన్‌లో భయంకరమైన బూతులు!

మస్తాన్ సాయి అరెస్టుతో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. 'తిక్క రేగితే అందరిని డ్రగ్స్ కేసులో ఇరికిస్తా'నంటూ మస్తాన్ ఫ్రెండ్ ప్రీతి వాట్సప్ చాటింగ్‌ను పోలీసులు గుర్తించారు. రాజ్ తరుణ్‌, లావణ్యకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు మస్తాన్ అంగీకరించడంతో ఈ కేసు మరింత ఉత్కంఠగా మారింది.

New Update
Mastan Sai: తిక్కరేగితే అందరిని ఇరికిస్తా.. మస్తాన్ ఫోన్‌లో భయంకరమైన బూతులు!

Mastan Sai: నటుడు రాజ్ తరుణ్‌-లావణ్య లవ్ ఇష్యూతో వెలుగులోకి వచ్చిన డ్రగ్ ఫెడ్లర్ మస్తాన్ సాయి అరెస్టుతో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్‌లో డ్రగ్స్ సప్లై, కస్టమర్ల వ్యవహరంపై పోలీసులు ఆరా తీయగా మస్తాన్ సాయి స్నేహితురాలు ప్రీతీ (Preethi) వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రీతి, ఆమె స్నేహితుడు ఉదయ్ (Uday) డ్రగ్స్ తీసుకుంటున్న సమయంలో అసభ్యంగా ఉన్న ఫోటో, వీడియోలను రికార్డ్ చేసి మస్తాన్ సాయి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

రాజ్‌తరుణ్‌, లావణ్యకు డ్రగ్‌ సరఫరా..
ఈ మేరకు డ్రగ్స్, గంజాయి సేవిస్తున్న సమయంలో వీడియోలు తీసి అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తూ లోబరుచుకునే మస్తాన్.. ప్రీతి, ఉదయ్‌ల మధ్య డ్రగ్స్ సరాఫరాకు సంబంధించిన చాటింగ్ గుర్తించారు. తనకు డ్రగ్స్ కావాలి తీసుకురమ్మంటూ ప్రీతి వాట్సప్ లో మస్తాన్ కు మెసెజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే వారిమధ్య తగదాలు రావడంతో ప్రీతి మస్తాన్ ను బెదిరించిందని, తనకు తిక్క రేగితే అందరిని డ్రగ్స్ కేసులో ఇరికిస్తానని వాట్సప్ చాటింగ్ చేసినట్లు తెలిపారు. అంతేకాదు వారి చాటింగ్ లో పచ్చి బూతులున్నాయని, మరికొందరు డ్రగ్స్ తీసుకుంటున్న వ్యక్తుల ఫోటోలు, అమ్మాయిల ఫొటో, వీడియోలు కూడా ఉన్నాయని వెల్లడించారు. అలాగే రాజ్‌తరుణ్‌తో తనకు పరిచయం ఉందని, రాజ్‌తరుణ్‌ (Raj Tarun), లావణ్యకు (Lavanya) డ్రగ్‌ సరఫరా చేసినట్లు మస్తాన్ అంగీకరించడంతో ఈ కేసు మరింత ఉత్కంఠగా మారింది.

Also Read: భార్యను బండికి కట్టి లాక్కెళ్లిన భర్త!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Akhanda 2 పూనకాలు తెప్పిస్తున్న అఖండ 2 లేటెస్ట్ అప్డేట్

బాలయ్య 'అఖండ2' కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. నెల రోజుల షెడ్యూల్ కోసం ఈ చిత్ర బృందం వచ్చే నెల జార్జియా వెళ్తున్నట్లు సమాచారం. మే 2 నుంచి జార్జియా షెడ్యూల్ మొదలు కానుంది. దసరా కానుకగా మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

New Update

Akhanda 2 బాలయ్య  'అఖండ' భారీ విజయం తర్వాత అఖండ 2: తాండవం పై అంచనాలు పెరుగుతున్నాయి. బాలయ్య, బోయపాటి కాంబోలో రాబోతున్న నాల్గవ చిత్రమిది. ఇప్పటికే సగం చిత్రీకరణ పూర్తిచేసిన బోయపాటి.. ప్రస్తుతం నెక్స్ట్ షెడ్యూల్ కోసం లొకేషన్ల వేటలో ఉన్నారు. ఈ క్రమంలో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. 

జార్జియాలో లాంగ్ షెడ్యూల్ 

నెల రోజుల షెడ్యూల్ కోసం ఈ చిత్ర బృందం వచ్చే నెల జార్జియా వెళ్తున్నట్లు సమాచారం. మే 2 నుంచి జార్జియా షెడ్యూల్ మొదలు కానుంది. బాలకృష్ణ,  ఇతర ప్రధాన నటులకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి  జార్జీయాలో అద్భుతమైన లొకేషన్స్ కోసం అన్వేషిస్తున్నారట డైరెక్టర్ బోయపాటి. 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత మరోసారి బాలయ్య సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. 

telugu-news | cinema-news | latest-news | Akhanda 2 Updates | Balakrishna Akhanda 2 Movie

Advertisment
Advertisment
Advertisment