Kolkata case: జూనియర్ డాక్టర్‌ హత్య వెనుక డ్రగ్స్ మాఫియా.. అన్నీ పెద్ద తలకాయలే!

జూనియర్ డాక్టర్ అభయ హత్యాచార కేసులో మరో కొత్తకోణం బయటపడింది. ఆమె హత్య వెనుక డ్రగ్స్ మాఫియా ఉన్నట్లు ప్రచారం మొదలైంది. ఈ కేసులో అరెస్ట్ అయిన సంజయ్‌ రాయ్‌ బలిపశువేనని, ఈ హత్య వెనుక పెద్ద తలకాయలున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

New Update
Kolkata case: జూనియర్ డాక్టర్‌ హత్య వెనుక డ్రగ్స్ మాఫియా.. అన్నీ పెద్ద తలకాయలే!

Abhaya murder: కోల్ కతా జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో మరో కొత్తకోణం బయటపడింది. ఇప్పటికే ఈ కేసు కీలక మలుపులు తిరుగుతుండగా.. తాజాగా ఈ హత్య వెనుక డ్రగ్స్ మాఫియా ఉన్నట్లు ప్రచారం మొదలైంది. ఆర్జీకర్‌ హాస్పిటల్‌ కేంద్రంగా కొంతకాలంగా డ్రగ్స్ దందా కొనసాగుతోందని, ఈ విషయం గుర్తించిన అభయ గుట్టు రట్టు చేస్తుందనే భయంతోనే ఆమె హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన సంజయ్‌ రాయ్‌ బలిపశువేనని, ఈ హత్య వెనుక పెద్ద తలకాయలున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారించనున్న నేపథ్యంలో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చీఫ్‌ జస్టిస్ డి.వై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.

ఈ సమాచారం ఎక్కడదొరుకుతుందో తెలీదు..
మరోవైపు అభయపై అత్యంత పాశవికంగా దాడి జరుగుతుందటే యాజమాన్యం ఆలస్యంగా స్పందించడంపై కోల్ కతా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే పలు వార్తలను కోల్‌కతా పోలీసులు ఖండించారు. కోల్‌కతా పోలీస్‌ చీఫ్ వినేశ్‌ గోయల్‌ మాట్లాడుతూ.. జూనియర్ డాక్టర్ పోస్టుమార్టం ప్రక్రియ మేజిస్ట్రేట్ ఎదుట జరిగింది. దానిని మొత్తం వీడియో తీశారు. ఆమె శరీరంలో ఎముకలు విరిగినట్లు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు వార్తలు వచ్చాయి. శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్టుమార్టంలో గుర్తించినట్లు రాసుకొచ్చారు. ఆమె తల్లిదండ్రులు కోర్టులో వేసిన పిటిషన్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారని పలు కథనాలు. కానీ ఇందులో వాస్తవం లేదు.

ఇలాంటి సమాచారం వాళ్లకి ఎక్కడదొరుకుతుందో అర్థం కావడం లేదు. వివిధ రూపాల్లో ఇది మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే ఇలాంటివి జరుగుతున్నాయి. మృతి ఘటనలో ఎలాంటి ఫిర్యాదు అందనప్పుడు పోలీసులు ముందుగా దాన్ని అసహజ మరణంగా నమోదు చేస్తారు. ఎవరైనా ఫిర్యాదు చేసినా లేదా పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా అది హత్యా లేదా ఆత్మహత్య అనేది ప్రస్తావిస్తారు. ఎలాంటి ఫిర్యాదు లేనప్పుడు అసహజ మరణం కేసు నమోదు చేయడం సహజం. మేము అసహజ మరణంగా నమోదు చేసి, ఆత్మహత్యగా చూపించాలనుకుంటున్నామని ఎందుకు చెబుతున్నారో అర్థం కావడం లేదన్నారు వినేశ్‌ గోయల్‌.

Advertisment
Advertisment
తాజా కథనాలు