Viral Video : మొక్కజొన్న తోటలో డ్రోన్ల చక్కర్లు...అత్యాచార నిందితుడి కోసం గాలింపు..!!

అత్యాచారానికి పాల్పడిన నిందితుడి కోసం డ్రోన్స్ సాయం తీసుకున్నారు పోలీసులు. ఓ మహిళపై దుండగుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మహిళ కేకలు వేయడంతో మొక్కజొన్న చేనులో దాక్కున్నాడు. 15ఎకరాలు 6 అడుగుల ఎత్తులో ఉన్న చేనులో దుండగుడిని పట్టుకునేందుకు డ్రోన్ల సాయం తీసుకున్నారు.

New Update
Viral Video :  మొక్కజొన్న తోటలో డ్రోన్ల చక్కర్లు...అత్యాచార నిందితుడి కోసం గాలింపు..!!

Viral Video : నంద్యాల జిల్లా ఆత్మకూరు(Nandyala District Atmakuru) పోలీసులకు వింత ఘటన ఎదురైంది. అత్యాచార నిందితుడి కోసం డ్రోన్స్ ను ఉపయోగించారు. 15 ఎకరాల్లో 6 అడుగుల ఎత్తులో ఉన్న మొక్కజొన్న తోటలో నిందుతుడిని పట్టుకోవడం కష్టంగా మారింది. దీంతో పోలీసులు డ్రోన్స్(Drones) ను ఉపయోగించారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే మొక్కజొన్న తోటకు వెళ్లి ఓ మహిళపై దుండగుడు అత్యాచారా యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణ శివారులో చోటుచేసుకుంది. ఆత్మకూరు పట్టణానికి చెందిన ఓ మహిళ తమ మొక్కజొన్న పంట దగ్గరకు వెళ్లింది. పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా అక్కడే కందిచేనులో మాటు వేసిన ఓ దుండగుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కేకలు వేస్తున్నా వదలకుండా ఆమెపై బలవంతం చేశాడు. దుండగుడిని తోసేసి పరుగులు తీసింది ఆ మహిళ. ఆ సమయంలో మహిళ కేకలు విన్న ఆమె బంధువులు అక్కడి రావడం గమనించిన దండగుడు అక్కడి నుంచి పారిపోయాడు.

ఇది కూడా చదవండి: రైతులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. యూరియాపై కీలక ప్రకటన..!!

సదరు మహిళ కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే దుండగుడు సమీపంలోని దాదాపు 15ఎకరాల విస్తీర్ణం, 6 అడుగుల ఎత్తులో ఉన్న మొక్కజొన్నతోటలో దాక్కున్నాడు. దుండగుడిని వెతకడం పోలీసులకు సమస్యగా మారింది. దీంతో వారు వెంటనే రెండు డ్రోన్స్ కెమెరాలను తెప్పించి నిందితుడి కోసం గాలింపు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

అయినా వదలకుండా పోలీసులు పొలం చుట్టూ చేరి అక్కడే మకాం వేశారు. దీంతో ఎట్టకేలకు సాయంత్రం నిందితుడిని మొక్కజొన్న చేనులో నుంచి బయటకు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొక్కజొన్ని చేనులోకి వెళ్లిన నిందితుడు అప్పటికే మద్యం సేవించడంతో సాయంత్రం వరకు తోటలోనే నిద్రించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు గతంలోనూ ఓ మహిళాపై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు