Driving Licence: ఆర్టీవో ఆఫీస్‌కు వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు.. అదెలాగంటే..

గతంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవాలంటే ఆర్‌టీఓ వద్దకు వెళ్లి అధికారులతో మాట్లాడి, అప్లికేషన్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు సిస్టమ్ మొత్తం మారిపోయింది.

New Update
Driving Licence: ఆర్టీవో ఆఫీస్‌కు వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు.. అదెలాగంటే..

 Driving Licence: మీరు బైక్/కార్. మరేదైనా వాహనాన్ని నడపాలనుకున్నా.. దానికి డ్రైవింగ్ లైసెన్స్(Driving Licence) తప్పనిసరిగా అవసరం. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం చట్టరిత్యా నేరం. లైసెన్స్ అనేది ఇతర ప్రభుత్వ డాక్యూమెంట్స్ మాదిరిగానే చాలా కీలకమైంది. గతంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవాలంటే ఆర్‌టీఓ వద్దకు వెళ్లి అధికారులతో మాట్లాడి, అప్లికేషన్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు సిస్టమ్ మొత్తం మారిపోయింది. ఇంటర్నెట్ వినియోగం పెరగడం, అప్‌డేట్ సిస్టమ్ కారణంగా.. డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడం ఇప్పుడు మరింత సులభతరం అయ్యింది. ఈ ప్రక్రియ మొత్తం డిజిటలైజ్ అయ్యింది. అయితే, డాక్యుమెంట్ వేరిఫికేషన్ ప్రక్రియ మాత్రం.. భౌతికంగా హాజరు కావాల్సి ఉంటుంది. మీరు కూడా ఇంటి వద్ద నుంచే డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకుంటే.. ఆన్‌లైన్‌లో పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ విధంగా అప్లై చేసుకోండి..

డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడానికి.. ముందుగా రవాణా శాఖ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. డ్రైవర్స్/లెర్నర్స్ లైసెన్స్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత, మీ రాష్ట్రాన్ని ఎంచుకుని, లెర్నర్స్ లైసెన్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత తదుపరి ఫారమ్‌ను పూరించండి. ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలి. ప్రతి వివరాలను సరిగ్గా నమోదు చేసిన తరువాత, మీ ఫారమ్‌ను ఓసారి చెక్ చేసుకోవాలి. ఆ తరువాత సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

ఆ తరువాత మరో పేజీలో అన్ని అవసరమైన పత్రాలు, ఫోటోలను అప్‌లోడ్ చేసిన తర్వాత డాక్యూమెంట్‌పై ఇ-సైన్ చేయాలి. ఆ తర్వాత ఫీజు చెల్లించాలి. స్లాట్‌ను బుక్ చేసుకోవాలి. లెర్నర్స్ లైసెన్స్ పరీక్ష కోసం సమయాన్ని ఎంచుకోవాలి. ఆధార్ కార్డు ఉన్న దరఖాస్తుదారులకు, ఆన్‌లైన్ పరీక్షను తక్షణమే నిర్వహిస్తారు. అలాగే, ఇ-లెర్నర్ లైసెన్స్‌ను తక్షణమే జారీ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఆధార్ కార్డు లేని దరఖాస్తుదారులు పరీక్షకు హాజరు కావాలంటే పరీక్ష కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.

లెర్నర్ లైసెన్స్ పొందిన తర్వాత..

లెర్నర్ లైసెన్స్ పొందిన తర్వాత, చట్టబద్ధంగా డ్రైవింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. అయితే, మీరు డ్రైవింగ్ నేర్చుకునే వారని, మీ వాహనంపై చట్టపరమైన ఒక సింబల్‌ని ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇది రాష్ట్రాన్ని బట్టి మారుతుంది. మీ రాష్ట్రానికి అనుగుణంగా నియమాలను జాగ్రత్తగా చెక్ చేసుకుని డ్రైవింగ్ లైసెన్స్‌ కోసం అప్లై చేసుకోవచ్చు.

ఈ విధంగా శాశ్వత లైసెన్స్ పొందవచ్చు..

లెర్నర్ లైసెన్స్ పొందిన తర్వాత.. ఫిజికల్ డ్రైవింగ్/రైడింగ్ టెస్ట్ ఇవ్వడానికి 30 రోజుల తర్వాత RTO ఆఫీస్‌కి వెళ్లాలి. అందులో ఉత్తీర్ణత సాధించిన తర్వాత శాశ్వత లైసెన్స్ జారీ చేయబడుతుంది. రాష్ట్రాన్ని బట్టి కొన్ని విధానాలు మారే అవకాశం ఉంది. కానీ దాదాపు అ రాష్ట్రాల్లోనూ ఇలాంటి విధానమే ఉంటుంది.

Also Read:

IND vs SL Asia Cup 2023: దుమ్ము రేపిన సిరాజ్.. ఒకే ఓవర్లో 4 వికెట్లు.. సరికొత్త రికార్డ్..

Congress: మహాలక్ష్మి స్కీమ్‌ ద్వారా నెలకు రూ. 2500..రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు