milk: పాలు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి ప్రమాదమా? రోజుకి ఎంత పాలు తాగాలో తెలుసా?

పాలు తాగడం వల్ల జుట్టు, చర్మం, ఎముకలు దృఢంగా మారడంతో పాటు శరీరానికి విటమిన్ డి, క్యాల్షియం, ప్రొటీన్లు సమృద్ధిగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పాలు ఎక్కువగా తాగడం వల్ల మరణాలు, పగుళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

New Update
milk: పాలు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి ప్రమాదమా? రోజుకి ఎంత పాలు తాగాలో తెలుసా?

milk: పాలు తప్పక తాగాలని ఇంట్లో పెద్దలు తరచుగా చెబుతుంటారు. దీంతో ఎముకలు దృఢంగా ఉంటాయి. పాలు తాగడం వల్ల జుట్టు, చర్మం, ఎముకలు దృఢంగా మారడంతో పాటు శరీరానికి విటమిన్ డి, క్యాల్షియం, ప్రొటీన్లు సమృద్ధిగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరూ పాలు తాగాలని వైద్యులు కూడా చెబుతున్నారు. కానీ కొంతమందికి పాలు తాగడం చాలా ప్రమాదకరం. పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ దేనినైనా అతిగా వాడటం అనేది ఎప్పుడూ హానికరమే అని నిపుణులు అంటున్నారు. ఏయే వ్యక్తులు పాలు తాగకూడదో చాలామందికి తెలియదు. ఒక రోజులో పాలు ఎక్కువగా తాగడం వల్ల మరణాలు, పగుళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎక్కువ పాలు తాగడం కూడా ఆరోగ్యానికి ప్రమాదకరం, రోజుకు ఎంత పాలు తాగాలి అనేదానిపై ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

పాలు వల్ల నష్టాలు- ఎంత పాలు తాగాలి:

  • ఎక్కువ పాలు తాగడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. పాలలో చాలా కొవ్వు, కేలరీలు, లాక్టోస్ పుష్కలంగా ఉంటాయి. దీని కారణంగా బరువు వేగంగా పెరుగుతారని నిపుణులు అంటున్నారు.
  •  రోజూ పాలు తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం, అపానవాయువు, అతిసారం, మలబద్ధకం వంటి తీవ్రమైన కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. చెడు, మంచి బ్యాక్టీరియా రెండూ పాలలో కనిపిస్తాయి. అందువల్ల.. రెండింటి మధ్య సమతుల్యతను సృష్టించడం చాలా ముఖ్యం.
  •  పాలు ఎక్కువగా తాగడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. ఇందులో ఉండే లాక్టోస్ చాలామందికి జీర్ణం కాదు. జీర్ణక్రియ క్షీణించి విరోచనాలు, వాంతులు అవుతాయి.
  •  స్కిన్ అలర్జీ సమస్య ఉంటే పాలు అస్సలు తాగకూడదు. మొటిమలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలను కలిగిస్తుంది. చర్మవ్యాధులతో బాధపడేవారికి పాలతో అనేక రకాల వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే, శరీరంపై ఎర్రటి దద్దుర్లు కనిపించవచ్చు.
  •  కాలేయ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా పాలు తాగకూడదు. పాలలో కొవ్వు పుష్కలంగా ఉంటుంది. అలాగే కాలేయం సరిగా జీర్ణం చేసుకోలేకపోతుంది. దీని వల్ల కాలేయం ఉబ్బిపోతుంది.

రోజులో ఎంత పాలు తాగాలి:

ప్రతివ్యక్తి శారీరక సామర్థ్యంతో పాటు వయస్సు, ఎత్తుకు అనుగుణంగా పాలు తాగాలంటున్నాను నిపుణులు. 3 సంవత్సరాల వరకు పిల్లలు - 300 నుంచి 500 ml పాలు, 4 నుంచి 10 సంవత్సరాల వయస్సు - 400 నుంచి 600 ml పాలు, 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయస్సు - 500 ml నుంచి 700 ml పాలు, 18 ఏళ్లు పైబడిన వారు - 1 నుంచి 2 గ్లాసుల పాలు తగవచ్చని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణకు చల్లటి కబురు.. రేపటి నుంచి వానలే వానలు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు