AloeVera Juice: ఉదయాన్నే టీ,కాఫీ బదులు ఇది ట్రై చేయండి.. మీ డే సూపర్‌గా ఉంటుంది ప్రతీరోజూ ఉదయం కలబంద రసంతో తాగటం వలన ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపడంతోపాటు చర్మం మెరుస్తూ, వెంట్రుకలు దట్టంగా ఉండేలా చేస్తుంది. ఇది చురుకుదనం, జీర్ణశక్తిని పెంచడం, రక్తంలో చక్కెరను నియంత్రించడం వంటివి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 12 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి AloeVera Juice: కలబంద జెల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. కానీ కలబంద రసంతో రోజుని ప్రారంభిస్తే అది మనకు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇది నోటి ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కలబంద జ్యూస్ రోజూ ఉదయాన్నే తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది టీ, కాఫీకి బదులుగా అలోవెరా జ్యూస్‌తో మీ ఉదయాన్నే ప్రారంభిస్తే ప్రయోజనాలు లభిస్తాయని అంటున్నారు. ఉయదం టీ, కాఫీతో రోజూని ప్రారంభిస్తారు. కొందరు వ్యక్తులు కెఫీన్‌కు ఎంతగానో బానిసలయ్యారు. ఇలాంటి వారికి ఉదయం టీ, కాఫీ లేకుండా ప్రారంభం కాదు. టీ, కాఫీలకు బానిసలైన వ్యక్తులు కెఫీన్‌తో తమ రోజును ప్రారంభించకపోతే.. వారి రోజంతా నీరసంగా గడిచిపోతుంది. కానీ ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే. దీనిని మార్చవచ్చని నిపుణులు అంటున్నారు. టీ, కాఫీ కాకుండా..కొన్ని ఇతర ఆరోగ్యకరమైన పానీయాలను మారవచ్చు.దీనిని తాగడం ద్వారా రోజంతా ఆరోగ్యంగా గడపవచ్చు. ఈ డ్రింక్ తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చర్మం మెరుస్తుందని చెబుతున్నారు. ఈ రోజు..టీ, కాఫీ కాకుండా..అటువంటి పానీయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కలబంద రసం: ఉదయం టీ,కాఫీకి బదులుగా అలోవెరా జ్యూస్‌తో రోజు ప్రారంభించడం ఉత్తమం. దీని వినియోగం ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపడంతోపాటు చర్మం మెరుస్తూ వెంట్రుకలు దట్టంగా ఉండేలా చేస్తుంది. ఇది చురుకుదనం, జీర్ణశక్తిని పెంచడం, రక్తంలో చక్కెరను నియంత్రించడం వంటివి చేస్తుంది. బరువు తగ్గుతారు: అలోవెరాలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బరువు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. కలబందలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ పాలీఫెనాల్స్ శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తుంది. విటమిన్ కొరత ఉండదు: విటమిన్ సి లోపంతో బాధపడేవారు ఉదయం లేవగానే కలబంద రసాన్ని సేవించాలి. అలోవెరాలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ సి ఒక రకమైన యాంటీఆక్సిడెంట్. ఇది శరీరంలో ఐరన్ సరఫరా చేస్తుంది. నోటి దుర్వాసన పరార్: ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత కలబంద రసాన్ని తీసుకుంటే.. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచటంతోపాటు చిగుళ్ళను బలోపేతం చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం కలబంద రసంతో పుక్కిలిస్తే.. నోటి నుంచి దుర్వాసన సమస్య తగ్గుతుంది. ఇది కూడా చదవండి: స్త్రీలకు కసూరి మేతి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #aloevera-juice మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి