Natural Drink: ఈ నేచురల్‌ డ్రింక్‌తో ముఖంపై మెరుపు ఖాయం.. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

పిగ్మెంటేషన్‌ను తొలగించడానికి ఒక అద్భుత డ్రింక్‌ ఉంది. మార్కెట్‌లో దొరికే క్రీములే కాకుండా కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలతో కూడా చర్మాన్ని కాపాడుకోవచ్చు. ఒక చిన్న దోసకాయ, అర కప్పు దానిమ్మ, కరివేపాకు రెబ్బలతో డ్రింక్ తయారీ స్టెప్స్ కోసం ఆర్టికల్‌లోకి వెళ్ళండి.

New Update
Natural Drink: ఈ నేచురల్‌ డ్రింక్‌తో ముఖంపై మెరుపు ఖాయం.. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

Natural Drink: ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని పొందడానికి ఉపరితల చర్మ సంరక్షణ ఎంత ముఖ్యమో చర్మాన్ని లోపల నుంచి కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. పిగ్మెంటేషన్‌ను తొలగించడానికి ఒక అద్భుత డ్రింక్‌ ఉంది. ప్రతి ఒక్కరూ మెరిసే, మచ్చలేని స్కిన్‌ కావాలని కలలుకంటారు. అంతేకాకుండా స్కిన్‌ క్రీమ్‌ల కోసం పెద్ద మొత్తంలో డబ్బు కూడా ఖర్చు చేస్తారు. అయితే ఎంత ఖర్చు చేసినా మంచి స్కిన్‌టోన్‌ను పొందలేకపోతుంటారు. అయితే కేవలం మార్కెట్‌లో దొరికే క్రీములే కాకుండా కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలతో కూడా చర్మాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు అంటున్నారు. స్కిన్ పిగ్మెంటేషన్ అనేది ఒక సాధారణ చర్మ సమస్య. ఇది చాలా మంది మహిళలు, పురుషుల్లో కూడా సంభవిస్తుంది. లోపలి నుంచి చర్మం పిగ్మెంటేషన్ తొలగించడానికి ప్రతిరోజూ ఒక డ్రింక్‌ను తాగడం వల్ల చర్మం సహజంగా మెరుస్తుంది. ఆ డ్రింక్‌ గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

డ్రింక్‌కు కావాల్సినవి:

  • ఒక చిన్న దోసకాయ, అర కప్పు దానిమ్మ, 12 కరివేపాకు రెబ్బలు, అర నిమ్మకాయ

ఇది కూడా చదవండి: వేసవిలో రోజుకు 3 కప్పుల కంటే ఎక్కువ కాఫీ లేదా టీ తాగితే ఏం జరుగుతుంది?

ఇది ఎలా సహాయపడుతుంది:

  • దోసకాయలో యాంటీఆక్సిడెంట్లు, సిలికా అధికంగా ఉంటాయి. ఇవి పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే దానిమ్మలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి పిగ్మెంటేషన్ మచ్చలను పోగొడుతాయని నిపుణులు అంటున్నారు. కరివేపాకులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కూడా పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయి. మరోవైపు నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంపై నల్లటి మచ్చలు, పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: మంచం తీయకుండా నేలను ఇలా శుభ్రం చేసుకోండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు