Toothbrush: టూత్ బ్రష్‌ను బాత్‌రూమ్‌లో ఉంచుతున్నారా?..అయితే డేంజర్ టూత్ బ్రష్‌లను బాత్‌రూమ్‌లో ఉంచితే ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు.వాడే బ్రష్‌ని బాత్‌రూమ్‌లో పెట్టకండి. ఉపయోగించే ముందు బ్రష్‌ను బాగా కడగాలి. ఎప్పుడూ బ్రష్‌కి క్యాప్ పెట్టి ఉంచాలి. తడిచిన బ్రష్ పూర్తిగా ఆరేలా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 27 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Toothbrush: చాలా మంది టూత్ బ్రష్‌లను బాత్‌రూమ్‌లో ఉంచుతారు. అయితే ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మనం నిత్యం ఉపయోగించే వాటిలో టూత్ బ్రష్ ఒకటి. రోజుకు కనీసం రెండుసార్లు బ్రష్ చేయడం మంచిది. కాబట్టి దీనికి ఉపయోగించే టూత్ బ్రష్ చాలా ముఖ్యమైనది. చాలా మంది బాత్రూంలో పళ్లు తోముకుంటారు. అందుకే బాత్‌రూమ్‌లోనే బ్రష్‌ను ఉంచుతారు. నిజానికి టాయిలెట్‌లో టూత్ బ్రష్‌ను ఉంచడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా టూత్ బ్రష్ మురికిగా మారి నోటిలోకి సూక్ష్మక్రిములు ప్రవేశిస్తాయి. దీంతో అనేక రకాల వ్యాధులు వస్తాయి. జాగ్రత్తలు అవసరం: బాత్‌రూమ్ దగ్గర్‌లో బ్రష్ పెడితే మనం ఏ పనిచేసినా చిన్నచిన్న నీటిబిందులువు బ్రష్‌పై పడి సూక్ష్మజీవులు ఏర్పడతాయి. బ్రష్ మధ్యలో చిక్కుకుని ఉండిపోతాయి. అలాంటి బ్రష్‌తో నోటిని శుభ్రం చేసుకుంటే సులభంగా ఆ క్రిములు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. బాత్రూమ్ వాతావరణం: బాత్రూమ్ వాతావరణం తరచుగా తేమగా ఉంటుంది. దీనివల్ల రోగకారక క్రిములు ఎక్కువగా ఉండి వాతావరణంలోకి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంది. దీని కారణంగా అటువంటి బ్రష్లను ఉపయోగించడం వలన వ్యాధులు తొందరగా ప్రబలే అవకాశం ఉంటుంది. అలాగే ఒకే బాత్రూమ్‌ను ఒకటి కంటే ఎక్కువ మంది ఉపయోగిస్తే వ్యాధుల ప్రమాదం రెట్టింపు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వీలైతే మనం వాడే బ్రష్‌ని బాత్‌రూమ్‌లో పెట్టకండి. ఉపయోగించే ముందు బ్రష్‌ను బాగా కడగాలి. ఎప్పుడూ బ్రష్‌కి క్యాప్ పెట్టి ఉంచాలి. తడిచిన బ్రష్ పూర్తిగా ఆరేలా చూసుకోవాలి. ఇది కూడా చదవండి: బక్కగా ఉన్నారని దిగులా? ఈ బ్రెడ్‌తో రెండు వారాల్లో పది కేజీలు గ్యారెంటీ! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: సంతానం కోసం ఎక్కడికీ తిరగాల్సిన పని లేదు..పుత్రజీవక్‌ని ఒక్కసారి ట్రై చేయండి!! #health-benefits #bathroom #toothbrush మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి