Aloe Vera Health Benefits : కలబంద గుజ్జుతో ఇలా చేస్తే మోకాళ్ల నొప్పులు మాయం కలబంద గుజ్జును జ్యూస్ చేసుకొని తాగితే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. కలబంద గుజ్జులో విటమిన్ బి 12, విటమిన్ సి, ఏ, ఈతో పాటు జింక్, సోడియం, పొటాషియం, కాల్షియం, మినరల్స్ చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. By Vijaya Nimma 04 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Health Benefits: ప్రకృతి ప్రసాదించిన వరం కలబంద. ఆయుర్వేదంలో కూడా కలబంద గురించి చాలా గొప్పగా వివరించారు. షుగర్‌ను నియంత్రించడంలో, శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో, జీర్ణశక్తి పెంచడంలో, కొలస్ట్రాలను తగ్గించడంలో కలబంద ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. కలబందతో ఏయే సమస్యలను దూరం చేసుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కలబంద వల్ల కలిగే ప్రయోజనాలు కలబంద (Aloe Vera) ఇంట్లో ఉంటే వైరస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పిల్లలు ఉన్న ఇళ్లలో కచ్చితంగా కలబంద మొక్క ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కలబంద గుజ్జులో విటమిన్ బి 12, విటమిన్ సి, ఏ, ఈతో పాటు జింక్, సోడియం, పొటాషియం, కాల్షియం, మినరల్స్ అధికంగా ఉంటాయి. ప్రతిరోజు పొద్దున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 30 ఎంఎల్ కలబంద గుజ్జును వేసుకొని తాగితే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇలా చేయడం వల్ల షుగర్ కూడా పూర్తిగా నియంత్రణలోకి వస్తుంది. అంతేకాకుండా రోజంతా ఉత్సాహంగా పనిచేయవచ్చు. కలబంద గుజ్జును నీటిలో కలుపుకుని తాగితే శరీరంలో షుగర్ స్థాయిలు తగ్గుతాయి. బరువు కూడా తగ్గుతారు - కలబంద గుజ్జుతో చేసిన నీళ్లు తాగడం వల్ల శరీరంలోని మలిన పదార్థాలన్నీ బయటకు పోతాయి. ఇది కూడా చదవండి: వామ్మో.. వాము వల్ల ఇన్ని ప్రయోజనాలా? శరీరంలో ఎక్కువ వేడి ఉన్నవారు కలబంద గుజ్జును నీళ్లలో వేసుకొని తాగడం వల్ల ఎంతో చలువ చేస్తుంది. అంతేకాకుండా రోగ నిరోధకశక్తి కూడా పెరుగుతుంది. వ్యాధుల బారి నుంచి కూడా మనల్ని కాపాడుకోవచ్చు. నీటిలో వేసేటప్పుడు దానిపై ఉండే పచ్చ తొక్కను తీసేసి శుభ్రంగా కడిగి వేయాలి. కలబంద గుజ్జుతో మన పళ్ళను కూడా శుభ్రం చేసుకోవచ్చు. అంతేకాకుండా దంతాల్లో సమస్యలు కూడా ఉండవు. మోకాళ్ళ నొప్పులను తగ్గించే గుణం ఈ కలబందకు ఉంది. కలబంద గుజ్జులో ఆవు నూనె వేసి మోకాళ్ళకు మర్దన చేసుకుంటే నొప్పులు తగ్గిపోతాయి. ఈ గుజ్జును వేడి చేసి దూదితో మోకాళ్లపై రాస్తూ ఉంటే నొప్పి తగ్గిపోతుంది. కలబంద గుజ్జులో పెరుగు వేసి జుట్టుకు పట్టించుకోవడం వల్ల సమస్యలు తగ్గిపోతాయి. అయితే కొందరిలో మాత్రం కలబంద వాడితే ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్ది మోతాదుల వాడి ఎలర్జీ ఉంటే ఆపేయాలని నిపుణులు అంటున్నారు. #health-benefits #vitamins #aloe-vera-pulp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి