కుక్కను పెంచుకుంటే కష్టాలు తొలగిపోతాయా.. డాగ్ డెలివరీ పార్టీ ఇచ్చిన రాజ్‌కాళీ చెబుతుంది నిజమేనా?

పెంచుకున్న కుక్క ప్రసవించిన ఆనందంలో ఓ యజమాని ఊరంతా పిలిచి పండుగ చేసింది. ఒకేసారి 9 పిల్లలను కనడంతో 400 మందికి భోజనాలు పెట్టింది. పాటల కచేరీ ఏర్పాటు చేసింది. ఈ ఆసక్తికరమైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌ జిల్లా మేరాపూర్‌ గ్రామంలో జరిగింది.

New Update
కుక్కను పెంచుకుంటే కష్టాలు తొలగిపోతాయా.. డాగ్ డెలివరీ పార్టీ ఇచ్చిన రాజ్‌కాళీ చెబుతుంది నిజమేనా?

పెంచుకున్న కుక్క ప్రసవించిన ఆనందంలో ఓ యజమాని చేసిన పని జనాలను ఆశ్చర్యానికి గురిచేసింది. చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా సాదుకున్న కుక్క ఒకేసారి 9 పిల్లలను కనడంతో ఊరంతా పిలిచి పండుగ చేసింది. అంతేకాదు 400 మందికి భోజనాలు పెట్టడంతోపాటు పాటల కచేరీ ఏర్పాటు చేసి తెగ హంగామా చేసింది. ఈ ఆసక్తికరమైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌ జిల్లా మేరాపూర్‌ గ్రామంలో జరిగింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్తపై చాలామంది ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి అదృష్టం దక్కినందుకు కుక్కను తెగ పొగిడేస్తున్నారు.

విషయానికొస్తే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరాపూర్ గ్రామానికి చెందిన రాజ్‌కాళీ మహిళ కొంతకాలంగా ఈ కుక్కను పెంచుకుంటోంది. దానికి చట్నీ అని నామకరణం కూడా చేశారు. అయితే ఇటీవలే ఆ కుక్క ప్రసవించగా 9పిల్లలు పుట్టాయి. దీంతో రాజ్ కాళీ ఈ ఆనందం తట్టుకోలేకపోయింది. ఇరుగుపొరుగు, బంధువులలు, స్నేహితులు, పలవురిని పిలిచి పెద్ద పండుగ చేసింది. కుక్క పిల్లలను అందంగా అలంకరించి తొట్టెలలో పెట్టింది. మహిళలతో జోల పాటలు పాడించింది. 400 మందికి భోజనాలు పెట్టింది. అంతటితో ఆగకుండా పాటల కచేరీతో పాటు డప్పు వాయిద్యాలు కూడా ఏర్పాటు చేసింది.

Also read :ఫోన్‌ మైకంలో ఉంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయి.. వైరల్ అవుతున్న సజ్జనార్ వీడియో

అయితే ఈ సంబరాలు చేయడానికి బలమైన కారణం ఉందన్న రాజ్‌ కాళీ.. ‘గతంలో ఎన్నో కుక్కలను పెంచుకున్నా కొన్ని రోజుల తర్వాత అవన్నీ వెళ్లిపోయాయి. కానీ చట్నీ మాత్రం మమ్మల్ని వదిలి వెళ్లలేదు. ఈ కుక్కను పెంచుకున్నప్పటి నుంచి మా కష్టాలు తొలగిపోయాయి. మాములుగా కుక్కలకు 4 నుంచి 6 పిల్లలే పుడతాయి. కానీ మా కుక్కకు 9 పిల్లలు పుట్టడం చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పింది. ఇక చట్నీపై విపరీతమైన ప్రేమ పెంచుకున్న రాజ్‌కాళీ డెలివరీతో ఇంత భారీ విందు ఏర్పాటు చేసిందని గ్రామస్తులు అంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో అతిథుల కోసం భోజనంతో పాటు మిఠాయిలు తయారు చేయించింది. తొలుత ఈ కార్యక్రమాన్ని చూసి ఆ ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతోందని అనుకున్నారు. కానీ కుక్క డెలీవరీతో ఈ విందు ఏర్పాటు చేశారని తెలియడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. కొంతమంది మాత్రం విశ్వాసానికి మరో పేరుగా నిలిచిన కుక్కకు ఆ మాత్రం సెలబ్రేషన్స్ చేయడంలో తప్పేమి లేదంటున్నారు. ఏది ఏమైనా కుక్క డెలివరీ కారణంగా రాజ్ కాళీ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు