Thyroid: చిన్న వయసులోనే థైరాయిడ్ ఎందుకు వస్తుంది?..లక్షణాలేంటి? ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే థైరాయిడ్ బారినపడుతున్నారు. చాలా సందర్భాల్లో థైరాయిడ్ లక్షణాలు బయటపడవు. శరీరం లోపల అంతర్గతంగా వ్యాధి వృద్ధి చెందుతూ ఉంటుంది. సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఈ గ్రంథి శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. By Vijaya Nimma 29 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Thyroid: శరీరంలో ముఖ్యమైన గ్రంథులలో థైరాయిడ్ ఒకటి. ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే థైరాయిడ్ బారినపడుతున్నారు. థైరాయిడ్ గ్రంధి మెడ మధ్యభాగంలో గొంతు ముందుండే ఒక అవయవం. ఒకప్పుడు ఇది 50 ఏళ్ల వయసు తర్వాతే వచ్చేది. అందులో కూడా 60 శాతం మహిళలే ఉండేవారు. కానీ ఇప్పుడు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సులోనూ థైరాయిడ్ కేసులు పెరుగుతున్నాయి. చాలా సందర్భాల్లో థైరాయిడ్ లక్షణాలు బయటపడవు. శరీరం లోపల అంతర్గతంగా వ్యాధి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఈ థైరాయిడ్ గ్రంథి శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే.. ఈ గ్రంథి పనితీరులో తేడాల వలన హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, గాయిటర్ లాంటి సమస్యలు వస్తాయి. థైరాయిడ్ సమస్య ఎలా వస్తుందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. థైరాయిడ్‌లో ఎన్ని రకాలు ఉంటాయి? థైరాయిడ్ హార్మోన్ పనితీరు సరిగా లేనప్పుడు వస్తుంది. ఇందులో రెండు రకాలు ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్ తక్కువగా పనిచేస్తుంటే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. థైరాయిడ్ ఎక్కువ యాక్టివ్‌గా మారినప్పుడు దానిని హైపర్ థైరాయిడిజం అంటారు. అందుకే 30 ఏళ్లు పైబడిన వారు కూడా థైరాయిడ్‌ని చెక్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్న వయసులోనే థైరాయిడ్ ఎందుకు వస్తుంది? కొన్ని సందర్భాల్లో ఆటో ఇమ్యూన్ కారణాలతో చిన్న వయసులోనే థైరాయిడ్ వస్తుందని వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని థైరాయిడ్ గ్రంథిపై దాడి చేయడం వల్ల ఇలా జరుగుతుందని చెబుతున్నారు. అలాగే చెడు ఆహారపు అలవాట్లు, శరీరానికి పోషకాలు అందకపోవడం వల్ల కూడా థైరాయిడ్ వస్తుందని నిపుణులు అంటున్నారు. మానసిక ఒత్తిడి కూడా థైరాయిడ్ వ్యాధికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. మానసిక ఒత్తిడికి గురికావద్దు. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. 6 నెలలకోసారి థైరాయిడ్‌ని చెక్ చేసుకోవాలి. హైపో థైరాయిడిజం లక్షణాలు ఇవే : నీరసం, అలసటగా ఉంటుంది బరువు పెరుగుతారు ఎప్పుడూ నిద్రమత్తుగా ఉంటుంది బద్ధకంగా ఉండటంతోపాటు పనిపై ఏకాగ్రత పెంచలేరు. జుట్టు రాలిపోవడం, చర్మం పొడిబారడం, కండరాల నొప్పులు ఉంటుంది. అయొడిన్ లోపం, జీవనవిధానంలో లోపం, ఒత్తిడి వలన ఈ సమస్య వస్తుంది. ఇది కూడా చదవండి: ECGలో 100 కంటే ఎక్కువ BPM ప్రమాదకరమా? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #symptoms #thyroid #young-age మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి