Bald Head: వామ్మో..టీ తాగడం వల్ల బట్టతల వస్తుందా?

హార్మోన్ల మార్పులు, ఆహారం, మానసిక ఒత్తిడి, జన్యులోపాలతో చిన్న వయసులోనే బట్టతల వస్తోందని వైద్యులు అంటున్నారు. టీ, సోడా, కూల్‌డ్రింక్స్‌, ఇతర తీపి పానీయాలు, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పురుషుల్లో బట్టతల వస్తుంది.

New Update
Bald Head: వామ్మో..టీ తాగడం వల్ల బట్టతల వస్తుందా?

Bald Head: ఈ రోజుల్లో జుట్టు రాలడం చాలా సాధారణం అయిపోయింది. ఆధునిక ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరికి జుట్టు రాలిపోతూ ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ జుట్టు రాలడం పెద్ద సమస్యగా మారింది. అయితే టీలు అధికంగా తాగడం వల్ల కూడా జుట్టు రాలుతుందని ఓ అధ్యయనం చెబుతోంది. ఒకప్పుడు బట్టతలని పెద్ద సమస్యగా భావించేవారు. కానీ ఇప్పుడు 20-30 సంవత్సరాల వయస్సులో నుదురు వెడల్పుగా, బట్టతలగా ఉంటుంది. హార్మోన్ల మార్పులు, ఆహారం, మానసిక ఒత్తిడి, జన్యులోపాలతో చిన్న వయసులోనే బట్టతల వస్తోంది.

టీ తాగితే బట్టతల వస్తుందా?

టీ, సోడా, కూల్‌డ్రింక్స్‌, ఇతర తీపి పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పురుషుల్లో బట్టతల ఏర్పడుతుందని చైనాలోని సింఘువా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వెల్లడైంది. రోజూ వీటిని తాగే వారికి ఇతర వ్యక్తుల కంటే బట్టతల వచ్చే ప్రమాదం 60 శాతం ఎక్కువ. ఈ అధ్యయనంలో ప్రజల ఆహారపు అలవాట్ల డేటాను పరిశీలించారు.

వెయ్యి మంది మగవారిపై జరిపిన అధ్యయనంలో కీలక విషయాలు వెలుగుచూశాయి. తియ్యటి టీ, శీతల పానీయాలు కూడా ఎక్కువగా తాగేవారిలో ఎక్కువ మంది పురుషులు 50 ఏళ్లలోపు వారే. మగవారి బట్టతల సాధారణంగా 50 ఏళ్ల తర్వాత ప్రారంభమవుతుంది. కానీ ఎక్కువగా తీపి పానీయాలు తాగేవారిలో 40 ఏళ్లలోపు బట్టతల రావడం మొదలైంది. చిన్న వయసులోనే జుట్టు రాలడం కూడా ప్రారంభమైనట్టు గుర్తించారు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు డ్రింక్స్‌ తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం చిన్నవయసులోనే బట్టతల బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి. షుగర్ ఎక్కువగా ఉండేవి కూడా బట్టతలకి కారణమవుతాయి. అధిక చక్కెర శరీరంలో ఇన్సులిన్‌ను తగ్గిస్తుంది. అంతేకాకుండా హార్మోన్ల లోపానికి కూడా కారణమవుతుంది. అందుకే బట్టతల వస్తుందని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: మట్టి తినే అలవాటు ఎందుకు వస్తుంది?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు