Technology: తొలిసారి AI ద్వారా ఆపరేషన్ చేసిన వైద్యులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టిన రోగికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు వైద్య నిపుణులు. ఈ టెక్నాలజీ ద్వారా రక్తస్రావం తక్కువగా ఉంటుందని, రోగి త్వరగా కోలుకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 19 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Technology: రక్తంలో గడ్డలను దేశంలో తొలిసారి AI టెక్నాలజీ వాడి వైద్యులు తొలగించారు. గుర్గావ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 62 ఏళ్ల రోగికి AI సాంకేతికత ద్వారా విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఎటు చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని అందరూ వాడుతున్నారు. చివరికి ఆసుపత్రుల్లో కూడా ఏఐ టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టిన రోగికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీ: ఇటీవలి కాలంలో దేశంలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. యువకుల నుంచి వృద్ధుల వరకు చాలా మంది గుండెపోటుకు గురవుతున్నారు. దీనికి ప్రధాన కారణం శరీరంలో రక్తం గడ్డకట్టడం. దీని వల్ల రక్త ప్రసరణ సరిగా జరగక గుండెపోటు వస్తుంది. ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ.. గత ఏడాది నుంచి ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని, ఇప్పటి వరకు 25 మంది రోగులకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఆపరేషన్లు చేశామని తెలిపారు. ఈ ప్రక్రియలో రక్తస్రావం తక్కువగా ఉంటుందని, రోగి త్వరగా కోలుకుంటున్నారని అంటున్నారు. అలాగే భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీ ద్వారా పల్మనరీ ఎంబాలిజమ్‌తో బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్యం అందించడం సాధ్యమవుతుందన్నారు. ఆపరేషన్‌కు 15 నిమిషాలు: పల్మనరీ ఎంబోలిజం వ్యాధిలో పల్మనరీ ఆర్టరీలో రక్తం గడ్డకట్టడం ఏర్పడి, రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఏఐ టెక్నాలజీ ద్వారా ఛాతీ, ధమనులు తెరుచుకోకుండా రక్తం గడ్డలను సులభంగా తొలగించవచ్చని వైద్యులు అంటున్నారు. ఈ ఆపరేషన్‌కు కేవలం 15 నిమిషాలు పడుతుందని చెబుతున్నారు. నరేంద్ర సింగ్ అనే పైలట్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అకస్మాత్తుగా కాలు నొప్పి, వాపు కారణంగా ఎమర్జెన్సీ వార్డులో చేరాడని అంటున్నారు. ఆ రోగికి పెనుంబ్రా ఫ్లాష్ 12ఎఫ్ కాథెటర్ ఉపయోగించి రక్తం గడ్డలను తొలగించారు. ఇది కూడా చదవండి: మూత్రం ఎందుకు పసుపు రంగులో ఉంటుంది..? గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: అల్యూమినియం ఫాయిల్‌లో టాబ్లెట్స్ ఎందుకు ప్యాక్ చేస్తారు..? #technology #health-benefits #artificial-intelligence-technology మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి