Heart Attack Risk: ఆల్కహాల్, సిగరేట్ తాగుతున్నారా? జరభద్రం...ఆ రిస్క్ తప్పదంటున్న వైద్యులు..!!

చలికాలంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా గుండెపోటు ముప్పు 33 శాతం పెరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. చలి కాలంలో జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, మద్యం, ధూమపానం చేసేవారికి 33శాతం గుండెపోటు వచ్చే రిస్క్ ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

New Update
e-cigarette: తాట తీస్తాం.. ఈ-సిగరెట్ల అమ్మితే ఊరుకోబోం.. కేంద్రం నోటీసులు..!!

కాలుష్యంతో పాటు చలి తీవ్రత పెరగడంతో గుండెపోటు (Heart Attack Risk) ముప్పు పెరిగింది. చలికాలంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా..గుండెపోటు ముప్పు 33 శాతం పెరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. చలి కాలంలో జంక్ ఫుడ్(Junk food) తినడం, మద్యం సేవించడం (Drinking alcohol), ధూమపానం (smoking)చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆర్‌ఎంఎల్ హాస్పిటల్ కార్డియాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ తరుణ్ కుమార్ మాట్లాడుతూ.. చలికాలంలో గుండెపోటు ముప్పు (Heart Attack Risk) పెరగడానికి చాలా కారణాలున్నాయని తెలిపారు. అధిక చలి ధమనుల సంకోచానికి కారణమవుతుందని.. ఇది శరీరంలో రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుందన్నారు. అటువంటి పరిస్థితిలో, గుండెను పంప్ చేయడానికి ఎక్కువగా బలం అవసరం ఉంటుందని...ఇది గుండెపోటు ప్రమాదనాన్ని పెంచుతుందని తెలిపారు.

ఇదొక్కటే కారణంగా కాదు..వేసవిలో శరీరంలోనుంచి చెమట రూపంలో టాక్సిన్స్ (Toxins) అన్నీకూడా బయటకు వెళ్తాయి. అయితే శీతాకాలంలో చెమట రాకపోవడంతో టాక్సిన్స్ అన్నీ కూడా శరీరంలోనే పేరుకుపోతాయి. దీంతో శరీరంలో ద్రవం, ఉప్పు మొత్తాన్ని పెంచుతుంది. ఇది రక్తపోటు పెరుగుదలకు కారణం అవుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాదు ఇది గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుందని చెబుతున్నారు. శీతాకాలంలో హార్మోన్లలో హెచ్చుతగ్గులు (Fluctuations in hormones)ఉంటాయి. దీని కారణంగా ఫైబ్రినోజెన్ వంటి రక్తం గడ్డకట్టే కారకాలు పెరుగుతాయి. అలాంటి పరిస్ధితిలో ధమనుల సంకుచితం కారణంగా రక్తం గడ్డ కట్టే అవకాశం పెరుగుతుంది.

మరో కారణంగా ఏంటంటే ...చలికాలంలో చాలా మంది ఎక్కువగా ఆహారం తింటుంటారు. మద్యం సేవిస్తుంటారు. చలిని తట్టుకునేందుకు సిగిరెట్ తాగుతుంటారు. వ్యాయాయం, శారీరక శ్రమ కూడా తగ్గుతుంది. చాలా మంది చలికాలంలో వ్యాయామం చేయడం మానేస్తారు. కొంతమంది ఉదయం చలిలో స్వెట్టర్లు వంటివి ధరించరు. ఈ రెండు పరిస్థితులు ఆరోగ్యానికి ఎంతో హానికరం. దీని వల్ల చలికాలంలో రక్తపోటు, షుగర్ పెరుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాతావ‌ర‌ణం కాద‌ని, అందుకు త‌గ్గ‌కుండా ఉండ‌క‌పోవ‌డ‌మే స‌మ‌స్య‌ అని అంటున్నారు వైద్యులు. చలిని నివారించడం ముఖ్యం. ప్రజలు గది హీటర్లను కూడా ఉపయోగిస్తారు. అటువంటి పరిస్థితిలో, ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉన్నప్పుడు వేడిగా ఉండే గదిని లేదా ఉదయాన్నే వదిలి, వెంటనే వాష్‌రూమ్‌కు వెళ్లడం వల్ల జలుబు వస్తుంది, దీని కారణంగా ధమనులు సన్నబడటం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వృద్ధులు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. అందువల్ల, వేడి గదిని వదిలి వెంటనే చల్లని ప్రదేశానికి వెళ్లడం మానుకోవాలని సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: చలికాలంలో ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే డేంజర్.. తప్పక తెలుసుకోండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు