Prabhas : పదేళ్ల క్రితం ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించిన మూవీ ఏదో తెలుసా? ప్రభాస్ పదేళ్ల క్రితం ఓ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించాడు. 2014 లో హిందీలో 'యాక్సన్ జాక్సన్' అనే సినిమా వచ్చింది. అజయ్ దేవగన్ నటించిన ఈ మూవీని ప్రభుదేవా డైరెక్ట్ చేశారు. ఇందులో 'పంజాబీ మస్త్' అనే పాటలో ప్రభాస్ హీరోయిన్ సోనాక్షి సిన్హతో కలిసి డ్యాన్స్ చేశాడు. By Anil Kumar 24 Jun 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Prabhas Appeared In A Guest Role : 'బాహుబలి' తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఈ నెల 27 న 'కల్కి' (KALKI 2898 AD) అనే సైన్స్ ఫిక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత డార్లింగ్ వరుస ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టాడు. అందులో ఓ సినిమాలో గెస్ట్ రోల్ కూడా చేస్తున్నాడు. అదే 'కన్నప్ప' మూవీ (Kannappa Movie). మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ మూవీలో ప్రభాస్ నందీశ్వరుడి పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా కంటే ముందు ప్రభాస్ ఓ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించాడు. ఈ విషయం ఇప్పటిదాకా చాలామందికి తెలీదు. ఇంతకీ ఆ సినిమా ఏంటి? అజయ్ దేవగన్ మూవీలో... సరిగ్గా పదేళ్ల క్రితం హిందీలో 'యాక్సన్ జాక్సన్' (Action Jackson) అనే సినిమా వచ్చింది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా జంటగా నటించిన ఈ మూవీని ప్రభుదేవా డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో 'పంజాబీ మస్త్' అనే పాటలో ప్రభాస్ కనిపించాడు. హీరోయిన్ సోనాక్షి సిన్హతో (Sonakshi Sinha) కలిసి డ్యాన్స్ చేశాడు. అప్పట్లో ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు ప్రభాస్ క్యామియో ఉందని మేకర్స్ ఏమాత్రం రివీల్ చేయలేదు. Also Read : నా కొడుకు అందుకే పెళ్లి చేసుకోలేదు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన సల్మాన్ ఖాన్ తండ్రి! రిలీజ్ తర్వాత ఆడియన్స్ సాంగ్ లో ప్రభాస్ ను చూసి సర్ప్రైజ్ అయ్యారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత డార్లింగ్ మరోసారి 'కన్నప్ప' లో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఈసారి కేవలం పాటలో మాత్రమే కనిపించకుండా కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రను కూడా ప్రభాసే ఏరికోరి ఎంచుకున్నాడని ఇటీవల మంచు విష్ణు వెల్లడించిన విషయం తెలిసిందే. #prabhas #action-jackson-movie #ajay-devagan సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి