Inflation Calculator: 10, 20, 30 సంవత్సరాల తర్వాత రూ. 1 కోటి విలువ ఎంత అవుతుంది సాధారణంగా మనం సేవింగ్స్ చేసేటప్పుడు పదేళ్ల తరువాత 10 లక్షలు వస్తే సరిపోతాయనుకుంటాం. కానీ, ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగడం కారణంగా ఆ పదేళ్ల తరువాత పది లక్షల రూపాయల విలువ బాగా తగ్గొచ్చు. అందుకే సేవింగ్స్ విషయంలో ద్రవ్యోల్బణం ఎలా లెక్కించాలో ఈ ఆర్టికల్ తెలుసుకోవచ్చు By KVD Varma 27 Aug 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Inflation Calculator: డబ్బును దాచుకోవడం అందరూ చేస్తాం. కొందరు పిల్లల పెళ్లిళ్లు.. మరికొందరు వేరే అవసరాలు.. చాలామంది రిటైర్మెంట్ తరువాత జీవితం కోసం డబ్బు దాచుకుంటారు. దీనికోసం టార్గెట్ గా ఒక ఎమౌంట్ అనుకుంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన రిటైర్మెంట్ 30 ఏళ్ల తరువాత అవుతుంది అనుకుంటే.. అప్పటికి ఒక కోటి రూపాయలు ఉండేలా సేవింగ్స్ చేసుకుంటే సరిపోతుంది అని భావిస్తాడు. కానీ, అది తప్పు. కోటి రూపాయలు 30 ఏళ్ల తరువాత తానూ అనుకునే అవసరాలకు సరిపోకపోవచ్చు. ఎందుకంటే, ద్రవ్యోల్బణం అంటే ధరల్లో పెరుగుదల కారణంగా 30 సంవత్సరాల తరువాత కోటి రూపాయల విలువ తగ్గుతుంది. అప్పుడు కోటిరూపాయలు తమ అవసరాలకు సరిపోక పోవచ్చు. ఇప్పుడు మనం దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక ప్రాముఖ్యతను, ద్రవ్యోల్బణం మన సేవింగ్స్ ద్వారా కొనుగోలు శక్తిని ఎలా క్రమంగా తగ్గిస్తుందో తెలుసుకుందాం. ద్రవ్యోల్బణం డబ్బు విలువను ఎలా తగ్గిస్తుంది? మన బ్యాంక్ ఖాతాలో రూ. 1 కోటి ఉంటే ఈరోజు పెద్దదిగా కనిపిస్తుంది. కానీ, మన భవిష్యత్ ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఇది సరిపోకపోవచ్చు. ఎందుకంటే ద్రవ్యోల్బణం కారణంగా డబ్బు విలువ కాలక్రమేణా తగ్గుతుంది. ఉదాహరణకు, ఈ రోజు కారు ధర రూ. 10 లక్షలు అయితే, 15 ఏళ్లలో దాని ధర చాలా ఎక్కువగా ఉండవచ్చు. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి, మనం ఇప్పటితో పోలిస్తే 10 లేదా 15 సంవత్సరాల క్రితం కిరాణా లేదా ఇంటి అద్దెకు ఎంత ఖర్చు చేశాము అనే దానిని గుర్తుచేసుకుంటే సరిపోతుంది. ఇది ద్రవ్యోల్బణం డబ్బు విలువను ఎలా క్షీణింపజేస్తుందో వ్యత్యాసం చూపిస్తుంది. కాబట్టి, ఇప్పుడు రూ. 1 కోటి పెద్దదిగా అనిపించినా, భవిష్యత్తులో అది సరిపోకపోవచ్చు. 10, 20 లేదా 30 ఏళ్ల తర్వాత కోటి రూపాయల విలువ ఎంత అవుతుంది? 6% ద్రవ్యోల్బణం రేటు ఉంటుంది అని మనం అనుకుంటే, రూ.1 కోటి విలువ రూ.55.84 లక్షలకు తగ్గుతుంది. ఇలా ద్రవ్యోల్బణం దీర్ఘకాలిక పొదుపులు- పెట్టుబడులపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని చూపుతుంది. మరింత వివరంగా చెప్పుకోవాలంటే, 20 సంవత్సరాల తర్వాత, రూ. 1 కోటి విలువ దాదాపు రూ. 31.18 లక్షలకు తగ్గిపోతుంది, ఇది 6% ద్రవ్యోల్బణం కారణంగా జరుగుతుంది . చివరగా, 30 సంవత్సరాల తర్వాత, ప్పటి లెక్కల పరంగా సుమారు రూ. 1 కోటి అప్పటికి రూ. 17.41 లక్షలు అవుతుంది. మొత్తంగా చూసుకుంటే మధ్యస్థం నుండి దీర్ఘకాలిక రూపాయి విలువ క్షీణించడం జాగ్రత్తగా పదవీ విరమణ ప్రణాళిక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. మనం తరచుగా ఇప్పటి కొనుగోలు శక్తి ఆధారంగా మన ఆర్థిక ప్రణాళికలను ప్లాన్ చేస్తాము. అయితే, ఇది కాలక్రమేణా క్రమంగా తగ్గుతుంది. ఇంకా బాగా అర్ధం చేసుకోవాలంటే, మనం 6% రాబడితో ఇన్వెస్ట్మెంట్ చేస్తే.. అప్పుడు ద్రవ్యోల్బణం 6% ఉందని అనుకుంటే మనకు అదనంగా వచ్చే లాభం ఏమీ ఉండదు. చూడటానికి ఆ డబ్బు లెక్క ఎక్కువ కనిపించవచ్చు. కానీ, విలువ పరంగా మాత్రం తక్కువగా ఉంటుంది. Also Read : ఆలస్యంగా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్.. ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా? #inflation మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి