Tulsi Fort: తులసి కోట దగ్గర ఈ వస్తువులు అస్సలు ఉంచొద్దు అదృష్టాన్ని తెచ్చే మొక్కలుగా కొన్ని మొక్కలను పవిత్రంగా చూసుకోవడం ఆనవాయితిగా వస్తుంది. అలాంటి మొక్కల్లో తులసి తొలి స్థానంలో ఉంది. హిందూ విశ్వాసం ప్రకారం తులసి మొక్క ఇంట్లో సరైన దిశలో నాటడం ఎంతో మంచిది. తులసి మొక్క విషయంలో కొన్ని నియమాలు పాటించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 08 Nov 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Tulsi : ఇంట్లో తులసి మొక్క ఉంటే నెగెటివ్ ఎనర్జీ రాకుండా నిరోధిస్తుంది. తులసి మొక్కను పెంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ పెరుగుతుంది. అంతేకాదు అనారోగ్య సమస్యలు ఉంటే తులసి కాపాడుతుంది. ఇంట్లోకి సౌభాగ్యం, ధనవృద్ధికి తులసి దోహదం చేస్తుంది. ఇంకా.. కుటుంబ ఆర్థిక స్థితి మెరుగు పడడానికి ఇంట్లో తులసి మొక్క తప్పకుండా పెంచుకోవాలి. అయితే.. హిందూమతంలోని పవిత్రమైన మొక్కలలో తులసి మొక్క ఒకటి. తులసి లేకుంటే ఇంటి ప్రాంగణం ఎడారిగా ఉంటుంది. అలాగే ఇంటి ఆవరణలో తులసి పెట్టుకున్నప్పుడు కొన్ని నియమాలను పాటింకపోతే.. చాలా నష్టపోతారు. కొంతమంది జ్యోతిష్యులు ఈ ఐదు వస్తువుల్ని తులసి కోట దగ్గర పెట్టవద్దటుంన్నారు. గత జన్మలో తులసి పేరు బృందా తులసి మొక్క వద్ద చెప్పులు పెట్టటం వలన తల్లి తులసిని అవమానించినట్లే. ఏ రకమైన స్లిప్పర్, షూస్, కొత్తవి అయినా తులసి కోట వద్ద ఉంచకూడదు. ఇలా ఉంచితే ఇంట్లో పేదరికం వచ్చి ఆనందం, శ్రేయస్సును కోల్పోతుందని చెబుతున్నారు. అంతేకాదు.. శివలింగాన్ని కూడా తులసి చెట్టు ఉన్న పాత్రలో పెట్టవద్దు. పురానాల ప్రకారం గత జన్మలో తులసి పేరు బృందా, ఆమె జలంధర్ అనే రాక్షసుడి సతీమని. ఈ జలంధర్ రాక్షసుడిని శివుడు నాశనం చేశాడు.. అప్పటి నుంచి శివుడు తులసి గుంపు నుంచి దూరంగా ఉంచారు. తులసి వద్ద ముళ్ల మొక్క పెడితే ఇంట్లో ప్రతికూల ప్రభావాలతో పాటు ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఇది మన జీవితాన్ని బాధాకరంగా ఉంచుతుందని వాస్తుశాస్త్ర పడితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం చీపురు: తులసి మొక్క హిందూవులకు చాలా పవిత్రమైనది. పూజనీయమైనదని భక్తులు ఎక్కువగా నమ్ముతారు. అయితే.. చీపురు శుభ్రపరచడానికి వాడుతారు కాబట్టి తులసి మొక్క వద్ద చీపురు అస్సలు పెట్టవద్దు. ఇలా పెట్టడం వలన వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే సాయంత్రం వేళ ఇల్లు ఊడ్చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందని పడితులు చెబుతారు. తులసి పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. తులసి మొక్క దగ్గర చెత్త లేదా డస్ట్‌బిన్‌ను పెడితే తులసి మాత కోపానికి గురి అయ్యే అవకాశంతోపాటు విష్ణువుకి కోపం వస్తుంది. తులసి మొక్క వద్ద చెత్తబుట్టలు పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం లభించదని పడితులు చెబుతున్నారు. అయితే.. వాస్తును అనుసరించి తులసి మొక్కను ఇంటిలో సరైన స్థానంలో పెట్టుకోవాలి. అప్పుడే తులసి వల్ల కలగాల్సిన అన్ని లాభాలు మనకి వస్తాయి. తులసి మొక్కను తూర్పు దిక్కున ఉంచితే శ్రేష్టంగా చెబుతారు. మొక్కకి వెలుతురు ఉండే విధంగా జాగ్రత్త పడాలి. ప్రతి రోజూ సంధ్యా సమయంలో తులసి మొక్క దగ్గర దీపం వెలిగితే చాలా మంచిది. #helth-benefits #tulsi-fort మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి