Director krish : డైరెక్టర్ క్రిష్‌ కి డ్రగ్స్ పరీక్షలు!

రాడిసన్‌ డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్‌ పేరు వినిపిస్తుండడంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో తన పేరు చేర్చడంతో క్రిష్‌ స్పందించారు. గత వారం రాడిసన్‌ హోటల్‌ కి వెళ్లిన మాట నిజమే అని ఆయన పేర్కొన్నారు.

New Update
Director krish : డైరెక్టర్ క్రిష్‌ కి డ్రగ్స్ పరీక్షలు!

Drugs Case : గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్ కేసు(Drugs Case) టాలీవుడ్‌(Tollywood)  ప్రముఖుల మెడకు చుట్టుకుంటుంది. ఈ కేసులో అనుమానితుడిగా టాలీవుడ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ ని ఎఫ్‌ఐఆర్‌ లో చేర్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే 9 మంది పై కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేశారు.

దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిష్‌(Krish)  తప్పకుండా విచారణకు రావాల్సి ఉంటుందని డీసీపీ వినీత్‌ అన్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారాయి. గత వారం రాడిసన్‌ హోటల్‌(Radisson Hotel)  మీద దాడులు చేసిన పోలీసులు పెద్ద మొత్తంలో కొకైన్‌ ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఈ కేసులో టాలీవుడ్‌ కి చెందిన ఓ నిర్మాత, ఓ మోడల్‌ పేరు కూడా వినిపిస్తుంది. రాడిసన్‌ హోటల్‌ కి డ్రగ్స్‌ తీసుకుని వచ్చిన అబ్బాస్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వివరించారు. హోటల్ లో పార్టీ జరుగుతున్న సమయంలో హోటల్‌ లో ప్రముఖ దర్శకుడు క్రిష్‌ అరగంట పాటు పోలీసులు గుర్తించారు. ఆయన హోటల్‌ యజమాని వివేకానందతో మాట్లాడినట్లు సమాచారం.

అందుకే అనుమానంతో పోలీసులు క్రిష్‌ పేరుని కూడా ఎఫ్ఐఆర్‌(FIR) లో చేర్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే క్రిష్‌ కి వైద్య పరీక్షలు నిర్వహిస్తే అనుమానాలన్ని తీరిపోతాయని పోలీసులు తెలిపారు. రక్త పరీక్షలు చేసి విచారించబోతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఈ కేసులో తన పేరు చేర్చడంతో క్రిష్‌ స్పందించారు. గత వారం రాడిసన్‌ హోటల్‌ కి వెళ్లిన మాట నిజమే అని ఆయన పేర్కొన్నారు. అయితే పార్టీలో పాల్గొనేందుకు కాదని... ఓ స్నేహితున్ని కలవడానికి మాత్రమే అక్కడికి వెళ్లినట్లు ఆయన వివరించారు. డ్రైవర్‌ రావడం ఆలస్యం కావడంతో కాసేపు హోటల్‌ యజమాని వివేకానందతో మాట్లాడినట్లు క్రిష్‌ వివరించారు.

డ్రైవర్‌ వచ్చిన వెంటనే అక్కడ నుంచి కారులో వెళ్లిపోయినట్లు క్రిస్ పేర్కొన్నారు. అంతేకానీ డ్రగ్స్‌ విషయంలో తనకి ఎలాంటి సంబంధం లేదని క్రిష్‌ వివరించారు.

Also Read : ఫ్రీ కంరెంట్‌ కు రెండు కండీషన్స్‌.. మళ్లీ అప్లై ఎలా అంటే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

అమాయక ప్రజల మృతిపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు సంతాపం తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఒక కవితతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

కన్నీటి కవిత

కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది!
అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దై పోతుంది. 

సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి- రుధిరం బైటికొస్తుంది.

అక్కడ రేపు పల్లకీ లెక్కి ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం వొరుసుకునీ నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా కళ్ళూ నోరూ మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! అంటూ తనికెళ్ల భరణి ఒక కవితను పంచుకున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

 

pahalgam | Pahalgam attack | pahalgam breaking news | tanikella-bharani | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment