DMRC vs Reliance Infra: అనిల్ అంబానీకి సుప్రీం షాక్.. రిలయన్స్ ఇన్‌ఫ్రా షేర్లు ఢమాల్!

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అనిల్ అంబానీకి చెందిన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించిన వివాదంలో సుప్రీం కోర్టు అనిల్ అంబానీకి షాక్ ఇచ్చింది. DMRC అనిల్ అంబానీ సంస్థకు 8 వేల కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పింది.

New Update
DMRC vs Reliance Infra: అనిల్ అంబానీకి సుప్రీం షాక్.. రిలయన్స్ ఇన్‌ఫ్రా షేర్లు ఢమాల్!

DMRC vs Reliance Infra: ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అంటే DMRC ఇకపై అనిల్ అంబానీకి చెందిన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్‌కు దాదాపు ₹ 8,000 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు ఈ చెల్లింపు ఉత్తర్వును చట్టవిరుద్ధమని పేర్కొంటూ తిరస్కరించింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్‌సి) దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై(DMRC vs Reliance Infra) విచారించిన  ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. న్యూ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కోసం ఆగస్టు 2008లో DMRC - అనిల్ అంబానీ యాజమాన్యంలోని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ (DAMEPL) మధ్య ఒక ఒప్పందం కుదిరింది.

నాలుగేళ్ల తర్వాత ఈ ఒప్పందం రద్దయింది. దీనిని ప్రశ్నిస్తూ డీఎంఆర్సీ మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ట్రయల్ కోర్టు రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు (DMRC vs Reliance Infra) వడ్డీతో కలిపి ₹3,000 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. దీనిని ప్రశ్నిస్తూ డిఎంఆర్‌సి త్రిసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించింది. తాజాగా సుప్రీం ధర్మాసనం  DMRCకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 

సుప్రీంకోర్టు తీర్పు(DMRC vs Reliance Infra) తర్వాత రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్ల విలువ 20 శాతం పడిపోయింది. షేర్ ధర ₹227కి చేరుకుంది. కంపెనీ మార్కెట్ క్యాప్ ₹2,250 కోట్లు కరిగిపోయింది.  మొత్తం మార్కెట్ విలువ ₹9,008 కోట్లకు పడిపోయింది. ఇప్పుడు డిఎంఆర్‌సి ఇప్పటివరకు డిపాజిట్ చేసిన మొత్తాన్ని కూడా డిఎఎంఇపిఎల్‌కు తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని బెంచ్ తెలిపింది. ఈ మొత్తం దాదాపు రూ.3,300 కోట్లు.

Also Read: గాలి నుంచి నీరు.. బెంగళూరు ప్లాంట్ లో ఎలా చేస్తున్నారంటే.. 

విషయం ఇదీ.. 

DMRC - DAMEPL(DMRC vs Reliance Infra) మధ్య 2008లో ఒప్పందం కుదిరింది

  • న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి సెక్టార్ 21 ద్వారక వరకు ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్ డిజైన్, ఇన్‌స్టాలేషన్, కమీషనింగ్, ఆపరేషన్ - మెయింటెనెన్స్ కోసం 2008లో DMRC - DAMEPL 30 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ లైన్ ఢిల్లీ విమానాశ్రయం మీదుగా వెళ్లాల్సి ఉంది.
  • DMRC అన్ని పౌర నిర్మాణాలను నిర్మించింది. DAMEPL పర్యవేక్షణలో అన్ని పనులు జరిగాయి. జూలై 2012లో, DAMEPL వయాడక్ట్‌లో కొన్ని లోపాలను గుర్తించిన తర్వాత కార్యకలాపాలను నిలిపివేసింది. సమస్యను పరిష్కరించడానికి DMRCకి నోటీసు పంపింది.
  • లోపాలను సరిదిద్దకపోవడంతో, అక్టోబర్ 2012లో, డీఎంఈపీఎల్ డీల్‌ను రద్దు చేయమని DMRCకి నోటీసు పంపింది. అనంతరం అధికారులు 2012 నవంబర్‌లో తనిఖీలు నిర్వహించి జనవరి 2013లో ఆపరేషన్‌కు లైన్‌ను ఆమోదించారు.
  • DAMEPL జనవరిలో లైన్‌ను పునఃప్రారంభించింది.  కానీ జూన్ 2013లో 5 నెలలలోపు ప్రాజెక్ట్‌ను వదిలివేసింది. దీని తర్వాత డీఎంఆర్‌సీ ఒప్పందంలోని ఆర్బిట్రేషన్ సెక్షన్ కింద ట్రిబ్యునల్‌లో కంప్లైంట్ చేసింది. ఐదు సంవత్సరాల తర్వాత, 2017లో, మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ DAMEPLకి అనుకూలంగా తీర్పునిచ్చింది. DMRCని సుమారు ₹2,800 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. దీంతో డీఎంఆర్సీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడి సింగిల్ బెంచ్ పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే, డివిజన్ బెంచ్ తర్వాత ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ ఉత్తర్వును 'భారత ప్రజా విధానానికి విరుద్ధం' అని పేర్కొంటూ దానిని పక్కన పెట్టింది. 
  • దీంతో అనిల్ అంబానీ నేతృత్వంలోని సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
  • 2021లో, మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ నిర్ణయాలను సవాలు చేయలేమని SC తీర్పునిచ్చింది అలాగే  నిర్ణయాన్ని సమర్థించింది. ఈ నిర్ణయం తర్వాత, DMRC క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేసింది, దీనిని ఏప్రిల్ 10, 2024న సుప్రీంకోర్టు అనుమతించింది.
  • 2021 చివరి నాటికి, మధ్యవర్తిత్వ అవార్డు ₹7,045.41 కోట్లకు పెరిగింది. DMRC అప్పటికి ₹ 1,000 కోట్లు చెల్లించింది.  మధ్యవర్తిత్వ తీర్పును చెల్లించే స్థితిలో లేదని కోర్టుకు తెలిపింది. ఇప్పుడు ఈ మొత్తం ₹8,000 కోట్లకు పెరిగింది.
Advertisment
Advertisment
తాజా కథనాలు