DK Aruna: నాకు ఆ కష్టాలు తప్పలేదు: అరుణ స్పెషల్ ఇంటర్వ్యూ!

మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ నాయకురాలు డీకే అరుణ RTVకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మారుతున్న సమాజంలో ఎదుగుతున్న స్త్రీ స్థితిగతుల గురించి ఆమె మాట్లాడుతూ నేటితరం స్త్రీ ప్రపంచంతో పోటీ పడుతుందన్నారు. ఇళ్లాలిగా తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

New Update
DK Aruna: నాకు ఆ కష్టాలు తప్పలేదు: అరుణ స్పెషల్ ఇంటర్వ్యూ!

Womens day: మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీజేపీ నాయకురాలు డీకే అరుణ RTVకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మారుతున్న సమాజంలో ఎదుగుతున్న స్త్రీ స్థితిగతుల గురించి ఆమె మాట్లాడుతూ.. నేటితరం స్త్రీ ప్రపంచంతో పోటీ పడుతుందన్నారు. ఇంట్లో పనులు చేయడమే కాదు బయట కూడా తనవంతు పాత్ర పోషిస్తుందని, ఆనాటి ఇంధిరాగాంధీ నుంచి నేటి ద్రౌపది ముర్ము, నిర్మాలాసీతారామన్ వరకూ ఎంతోమంది అతివలు ఆడపిల్లలకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ఈ క్రమంలోనే తన రాజకీయ ప్రస్తానంతోపాటు ఇంట్లోనూ ఒక ఇళ్లాలిగా నడుచుకునే తీరు గురించి ఆమె ఓపెన్ అయ్యారు.

ఇండిపెండెంట్ గా గెలిచి నిలిచాను..
డీకే అరుణ మాట్లాడుతూ.. 'నా ప్రయాణం మొత్తం రాళ్లు, ముళ్ల దారిలోనే సాగింది. డీకే అరుణను రాజకీయాల్లో లేకుండా చేయాలనే కుట్రలు ఎన్ని పన్నినా ధైర్యంగా నిలబడ్డాను. డీకే అరుణ అంటే ప్రజలకు ఒక విశ్వాసం. సాయం చేయడంలో వెనకాడదని ప్రజల బలమైన నమ్మకం. ఆ నమ్మకాన్ని ఇంతకాలంగా నిలబెట్టుకుంటూ వస్తున్నా. రాజకీయ ఎదుగుదలను నా శక్తితో ముందుకు తీసుకెళ్తున్న. ప్రజల సపోర్టుతోనే ఇంత వరకూ రాగలిగాను. ఆడది ఏం చేస్తుందనే ఆరోపణలు నేనూ ఎదుర్కొన్నాను. అందరిలాగే నాపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ వాటన్నింటీ పటాపంచలు చేస్తూ నేను మొదటిసారి ఇండిపెండెంట్ గా గెలిచి నిలిచి నేనేంటో చూపించాను. ప్రజలు నన్ను ఆదరించారు, ఆశీర్వదించారు. అదే విశ్వాసాన్ని ఇప్పటికీ నిలబెట్టుకున్నా' అని చెప్పారు.

ఇది కూడా చదవండి: Kavitha: రేసు గుర్రం కాదు.. గుడ్డి గుర్రం: రేవంత్ పై కవిత సెటైర్స్!

సంఖ్య పెరగాల్సిన అవసరముంది..
అలాగే ఆడవాళ్లకు సమాజంలో అనేక అడ్డంకులుంటాయని చెప్పారు. అన్ని రంగాల్లోనూ మహిళల పట్ల చిన్నచూపు ఉంటుందన్నారు. అయితే స్త్రీలు చాలా తక్కువ శాతం రాజకీయాల్లోకి వస్తున్నారని, ఇంకా సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందన్నారు. నరేంద్ర మోడీ హయాంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కు కల్పించేందుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిందని ఆమె గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల తర్వాత 33 శాతం మహిళలు పార్లమెంట్ కు వస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు

నూటికి రెండు వందల శాతం..
మహిళలకు పట్టుదల ముఖ్యం. మానసిక దైర్యం ఉంటేనే నిలబడి సాధించగలం. ఇతరుల మాటలు పట్టించుకుంటే ఎదగలేం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం. ఎవరు ఏం మాట్లాడిన మనం పట్టించుకోకూడదు. తెల్ల కాగితంపై పిచ్చి గీతలు గీయాలనుకుంటారు. వాటికి బయపడి ఆత్మస్తైర్యం కోల్పోకూడదన్నారు. అలాగే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి ఏంపీ పోటీ చేయబోతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు నూటికి రెండు వందల శాతం తాను గెలుస్తానన్నారు. ఇందిరా గాంధీ డైనమిక్ లిడర్. ఇప్పుడు మోడీ గారు అంతకుమించి డైనమిక్ లీడ్ ర్ గా ఎదిగారు . విజన్ ఉన్న నాయకుడు. ఆయన ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు.

వంటగదిలో ఇళ్లాలిగా..
డీకే అరుణ కేవలం రాజకీయాలే కాదు ఇంట్లో పనులు కూడా చాలా చక్కగా చేసుకుంటాను. వంట గదిలో అప్పుడప్పుడూ గడుపుతుంటా. ఇళ్లు ఊడ్చుకోవడం, బట్టలు సర్దు కోవడం వంటి పనులు చేస్తుంటాను. నాకు ఈ పని రాదు అనేది ఏదీ లేదు. నేను నాన్ వెజ్ కాదు. వెజ్ టేరియన్. పిల్లలు కావాలంటే చేసుకుని తింటారని చెప్పారు. ఇక బీజేపీ-బీఆర్ఎస్ ఒకటే అనేది పూర్తిగా అవాస్తవమన్నారు. బీజేపీ ప్రజలవైపు నిలబడింది. ప్రజల కోసమే నిలబడుతుంది. బీజేపీని దెబ్బ తీయడం కోసమే కాంగ్రెస్ ఇదంతా ప్రచారం చేస్తోందన్నారు.

అయోధ్య ప్రభావం..
ఇదొక బ్రహ్మాండమైన కార్యక్రమం. దేశంలో ప్రతి ఇళ్లు, ఊరు పండగ చేసుకున్నారు. ఇలాంటి కార్యక్రమం దేశ చరిత్రలోనే లేదు. రాముడు పుట్టిన స్థలంలో గుడి లేకపోవడమేంటి అని అందిరినీ కదిలించింది. స్వయంగా రాములవారే మోడీతో చేయించారేమో అనిపిస్తోంది. ప్రజల గుండెల్లో మోడీ నిలిచిపోయారు. గ్రామ గ్రామాన రామ నామస్మరణతోపాటు మోడీ పేరు మారుమోగిపోతుంది. ఈ దేశం బాగుపడాలంటే, పేదరికం పోవాలంటే నరేంద్ర మోడీ ఉండాలని కోరుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.

మోడీ హయాంలో మహిళలకు దక్కిన గౌరవం..
ప్రధాని మోడీ మహిళను గౌరవస్థితిలో ఉంచాలని చూస్తారు. ఆర్థిక స్తోమత పెంచి ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని కలలు కంటున్నారు. అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము, ఆర్థిక మంత్రి నిర్మాలసీతారామన్ లకు గౌరవం స్థానం కల్పించారని చెప్పారు. బేట పడావో.. బేటీ బచావో.. తీసుకోచ్చారు. మహిళలు టాయిలెట్ ఉండాలి. ఆత్మ గౌరవంతో బతకాలని చాలా పనులు చేపట్టారు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్, మహిళలకు లోన్లు, పొదుపుకు సహకారం అందించారు. చిరు వ్యాపారాలకు సాయం చేస్తూ ఆర్ధిక స్వతంత్రం రావాలని కోరుతున్నారు. ఇక మనమమీద మనకు నమ్మకం ఉండాలని, ఫుల్ టైమ్ కేటాయించాలనుకుంటేనే టరాజకీయాల్లోకి రావాలని సూచించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు