డీజే టిల్లు స్క్వేర్ క్రేజీ పోస్టర్.. వామ్మో అనుపమ .. ఈ రేంజ్ రొమాన్సా !!

డిజే టిల్లులో రాధిక అంటూ నేహా శెట్టితో సిద్దు జొన్నలగడ్డ చేసిన రొమాన్స్ ఎవ్వరూ మరచిపోలేరు . న్యూ ఇయర్ లో డీజే టిల్లు స్క్వేర్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.. ఈ పోస్టర్ ను అనుపమ తన ఇంస్టాగ్రామ్ లో  షేర్ చేయగా ఫ్యాన్స్ హార్ట్ బ్రేకింగ్ ఎమోజీలు పెడుతున్నారు.

New Update
డీజే టిల్లు స్క్వేర్ క్రేజీ పోస్టర్.. వామ్మో అనుపమ .. ఈ రేంజ్ రొమాన్సా !!

DJ Tillu Square :డిజే టిల్లులో రాధిక అంటూ నేహా శెట్టితో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) చేసిన రొమాన్స్ ఎవ్వరూ మరచిపోలేరు . ఇక ఇది టిల్లు స్క్వేర్ అంటే.. రొమాన్స్ ఇంకే రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. న్యూ ఇయర్ లో డీజే టిల్లు స్క్వేర్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.. ఈ పోస్టర్ ను అనుపమ (Anupama) తన ఇంస్టాగ్రామ్ లో  షేర్ చేయగా ఫ్యాన్స్ హార్ట్ బ్రేకింగ్ ఎమోజీలు పెడుతూ రియాక్ట్ అవుతున్నారు.

సిద్ధూ జొన్నలగడ్డ సెన్సేషనల్ హిట్ డీజే టిల్లు మూవీ కి సీక్వెల్ గా వస్తోన్న మూవీ డీజే టిల్లు స్క్వేర్. ఈ మూవీ అనౌన్స్ చేసేటప్పుడు ఉన్న బజ్ రాను రాను తగ్గుకుంటూ వచ్చింది. 2023 ఆగస్టులోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ వాయిదాల మీద అవాయిదాలు పడుతూ వచ్చింది. అయితే .. డీజే టిల్లు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ సెక్వేల్ పై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో కంటెంట్ పై మరి కాస్త శ్రద్ద తీసుకోవడంతో సినిమా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. న్యూ ఇయర్ సందర్బంగా రొమాంటిక్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఫిబ్రవరి 9 న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

న్యూ ఇయర్ లో న్యూ పోస్టర్

ఈ పోస్టర్ చూస్తుంటే అనుపమ పరమేశ్వరన్ అభిమానులకు మైండ్ బ్లాక్ అవుతోంది. సాధారణంగా అనుపమ వల్గారిటీ పాత్రలకు దూరంగా ఉంటుంది. ఇక.. లిప్ లాక్స్ విషయానికి వస్తే .. రౌడీ బాయ్స్ మూవీలో ఫాస్ట్ టైం లిప్ లాక్ కు అంగీకరించింది. ఈ సీన్ లో
ఆశిష్ మీద ట్రోల్స్ ఎంతగా వచ్చాయో అందరికీ తెలిసిందే. ఆ లిప్ లాక్ సీన్లు చూసి అనుపమ అభిమానులు హర్ట్ అయ్యారు.అలాంటిది సిద్ధూ జొన్నలగడ్డ తో సినిమా అంటే ఏమయినా ఉందా ? అయినా చూద్దాం ఎలా ఉండబోతోందో అని ఓపిక పట్టారు. న్యూ ఇయర్ సందర్బంగా రిలీజ్ చేసిన డీజే టిల్లు స్క్వేర్ పోస్టర్ చూసి షాక్ అవుతున్నారు.

సిద్ధూతో రొమాన్స్

డీజే టిల్లులో రాధిక అంటూ నేహా శెట్టితో సిద్దు చేసిన రొమాన్స్ అందరికీ తెలిసిందే. ఇక ఇది టిల్లు స్క్వేర్ అంటే.. రొమాన్స్ ఇంకే రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే వదిలిన ప్రచార కార్యక్రమాలు అయితే అనుపమ, సిద్దుల మధ్య మంచి రొమాంటిక్ కెమిస్ట్రీ కుదిరినట్టుగానే కనిపిస్తోంది. ఇక తాజాగా వదిలిన న్యూ ఇయర్ పోస్టర్ అయితే అనుపమ అభిమానుల గుండెల్ని బద్దలు కొట్టేస్తున్నాయ.

అనుపమ ఫ్యాన్స్ కామెంట్లు ..హార్ట్ బ్రేకింగ్ ఎమోజీలు

సిద్దు జొన్నలగడ్డ మీద అనుపమ కూర్చున్న ఈ స్టిల్ చూసి ఫ్యాన్స్ హార్ట్ బ్రోకెన్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు. అనుపమ తన ఇన్ స్టాలో పెట్టిన ఈ పోస్ట్ కింద కామెంట్లు చూస్తే అంతా నవ్వుకోవాల్సిందే. బ్రేకప్ కంటే ఇదే బాధగా ఉందని ఒకరు.. ఇప్పుడు నువ్వు మా గుండెల్ని బ్రేక్ చేశావ్.. ఇది నీకు న్యాయమా? అన్నట్టుగా అనుపమ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు.ఇకపై నువ్వు నా క్రష్ కాదు.. నేను సాయి పల్లవికి షిఫ్ట్ అవుతున్నాను.. అని మరో అభిమాని కామెంట్ పెట్టాడు. చీరలో నీ అందానికి ఫిదా అయ్యా కానీ.. ఇప్పుడు నువ్వు నా హృదయాన్ని బద్దలు కొట్టావ్.. అని ఇంకో నెటిజన్ అన్నాడు. మనసులే కరగని లోకమే లోకమా అంటూ బోరున ఏడుస్తున్న ఎమోజీలను పెడుతూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.సిద్ధూ జొన్నలగడ్డ ఈ మూవీ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఫిబ్రవరి 9 న థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ మూవీ అనుపమకు ఏ రేంజ్ మైలెజ్ ఇస్తుందో వేచి చూడాలి .

Also Read: సంక్రాంతి విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు.. రిలీజ్ డేట్స్ ఇవే

Advertisment
Advertisment
తాజా కథనాలు