AP News: ఏపీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు.!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. 8మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. వైసీపీ, టీడీపీ పార్టీలు ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టి..న్యాయ నిపుణుల సలహా మేరకు స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

New Update
AP News: ఏపీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు.!

AP News:  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. 8మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. వైసీపీ, టీడీపీ పార్టీలు ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టి..న్యాయ నిపుణుల సలహా మేరకు స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

publive-image

ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ కోరగా..మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్ పై టీడీపీ పిటిషన్ ఇచ్చింది. దీంతో ఈ మధ్యే విచారణ ముగించిన స్పీకర్ వారిపై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించారు.

publive-image

ఇది కూడా చదవండి: తెలంగాణలో ఉపఎన్నిక… షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..!!

ఇదే మొదటిసారి..
ఇక రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీలో భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలపై వేటు పడడం ఇదే మొదటిసారి. కాగా వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు నలుగురిపై శాసనసభలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే టీడీపీ తరఫున శాసనసభకు ఎన్నికై ఆ తర్వాత వైసీపీలో చేరిన నలుగురిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ విప్‌ డోలా బాలవీరాంజనేయస్వామి కంప్లైట్ చేశారు.

publive-image

స్పీకర్‌, ఎమ్మెల్యేలకూ మధ్య ప్రత్యుత్తరాలు..
ఈ క్రమంలోనే స్పీకర్‌ జనవరి 29న తొలిసారి ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ఆహ్వానించారు. వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు నలుగురూ స్పీకర్‌ ముందు హాజరై వివరణ ఇచ్చారు. తమపై ఫిర్యాదు చేస్తూ చీఫ్‌విప్‌ సమర్పించిన ఆధారాలకు సంబంధించిన ఒరిజినల్‌ పత్రాలను తమకు ఇవ్వాలని, వాటిని పరిశీలించి మళ్లీ వస్తామని స్పీకర్‌కు సూచించారు. ఆ తర్వాత స్పీకర్‌ కార్యాలయానికి.. ఎమ్మెల్యేలకూ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి.

publive-image

న్యాయ నిపుణుల సలహాతో..
అయితే టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేల్లో వాసుపల్లి గణేష్‌ మాత్రమే జనవరి 29న జరిగిన విచారణలో స్పీకర్‌ ముందు హాజరయ్యారు. మిగిలిన ముగ్గురూ స్పీకర్‌ను రాలేదు. తర్వాత కూడా ఎమ్మెల్యేలకు వ్యక్తిగత విచారణ కోసం స్పీకర్‌ సమయం ఇచ్చినప్పటికీ వారు హాజరుకాలేదు. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన స్పీకర్‌ తమ్మినేని ఎనిమిది మంది ఎమ్మెల్యేలపైనా అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు