Disha Patani: మైనస్‌ డిగ్రీల చలిలో ప్రభాస్‌తో క్యూట్‌ బ్యూటీ రొమాన్స్‌ .. ఇటలీ ఫొటోలు వైరల్!

ప్రభాస్ లేటెస్ట్ చిత్రం 'కల్కి'. ప్రస్తుతం ఈ మూవీ ఇటలీలో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ ప్రభాస్, దిశా కాంబోలోని సీన్స్ తెరకెక్కిస్తుండగా.. సెట్స్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసింది దిశా. మైనస్ డిగ్రీల చలిలో దుప్పటి కప్పుకొని వణికిపోతున్న వీడియోను పోస్ట్ చేసింది.

New Update
Disha Patani: మైనస్‌ డిగ్రీల చలిలో ప్రభాస్‌తో క్యూట్‌ బ్యూటీ రొమాన్స్‌ .. ఇటలీ ఫొటోలు వైరల్!

Disha Patani With Prabhas -Kalki 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ఒకటి నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కల్కి 2898 AD'. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని వైజయంతి బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్నారు.  బాలీవుడ్ హాట్ బ్యూటీస్ దిశా పటానీ, దీపికా పదుకొనె తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఇప్పటికే 70% శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ ప్రభాస్, దిశా పటానీ కాంబినేషన్ లో కొన్ని రొమాంటిక్ సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

ఇటలీలో ప్రభాస్ - దిశా పటానీ 

అయితే ఇటలీ షూటింగ్ లో  పాల్గొంటున్న హాట్ బ్యూటీ దిశా (Disha Patani) తాజాగా.. తమ షూటింగ్ కష్టాలను నెట్టింట షేర్ చేసింది. మైనస్ డిగ్రీల చలిలో దుప్పటి కప్పుకొని వణికిపోతున్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. దానికి "Italy photo dump..@ 'కల్కి 2898 AD" అనే క్యాప్షన్ జోడించింది ఈ బ్యూటీ. అలాగే సెట్స్ లో ప్రభాస్ తో కలిసి ఉన్న కొన్ని క్యూట్ ఫోటోలను కూడా షేర్ చేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.

Disha Patani With Prabhas -Kalki 2898 AD

Disha Patani

publive-image

publive-image

publive-image

Also Read: Vijay Devarakonda – Rashmika: “అవును ఇష్టపడుతున్నాను.. ప్రేమిస్తున్నాను”.. విజయ్ దేవరకొండతో రిలేషన్ షిప్ పై రష్మిక షాకింగ్ కామెంట్స్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు