భవిష్యత్ కార్యాచరణపై బీఆర్ఎస్ అసంతృప్తి నేతల మంతనాలు

బీఆర్‌ఎస్ టికెట్లు రాని అభ్యర్థులు బాహాటంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేశారు. ఆమెతో పాటు వేముల వీరేశం, రాథోడ్ బాపూరావు, మరికొంత మంది నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు.

New Update
భవిష్యత్ కార్యాచరణపై బీఆర్ఎస్ అసంతృప్తి నేతల మంతనాలు

బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో టికెట్ రాని నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కుతున్నారు. ఈ క్రమంలోనే ఖానాపూర్ నుంచి టికెట్ ఆశించి నిరాశకు గురైన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సంచలన కామెంట్స్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు ఎస్టీ నేతలను మార్చారని గులాబీ బాస్‌పై ఆమె ఫైర్ అయ్యారు. తాను గెలిచాక మంత్రి పదవి అడుగుతాననే సీఎం కేసీఆర్ ఈ సారి తనకు టికెట్ ఇవ్వలేదని తెలిపారు. ఇక ఖానాపూర్ అభ్యర్థిగా ఫైనల్ చేసిన జాన్సన్ నాయక్ అసలు ఎస్టీనే కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అగ్రవర్ణాలకే మంత్రి పదవులు కట్టబెడుతున్నారని ఆమె మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ టికెట్ కోసం ఆమె తరపున పీఏ దరఖాస్తు చేశారు.

వెనక్కి తగ్గిన మైనంపల్లి.. కేటీఆర్ హెచ్చరిక ఎఫెక్ట్??

మైనంపల్లి కామెంట్స్..

⇨ మనవడికి పుట్టువెంట్రుకలు శ్రీవారి చెంత తీశాం
⇨ రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం
⇨ నా కుమారుడు సమాజ సేవ చేస్తున్నాడు.. అతనికి సపోర్ట్ ఉంటాను
⇨ నిన్న నా వ్యక్తిగతంగా మాట్లాడను
⇨ హైదరాబాద్ వెళ్లాక పూర్తి సమాచారం ఇస్తాను
⇨ మెదక్, మల్కాజ్‌గిరి ప్రజలతో మాట్లాడి తర్వాతి కార్యాచరణ చెప్తాను
⇨ ప్రజల మద్దతు నాకుంది
⇨ నాకు, నా కుమారుడుకి టికెట్లు ఇస్తే భారీ మెజారిటీతో గెలుస్తాం

⇨  నా కృషితో ఎదిగాను, అలాగే ఉంటాను

విభిన్నంగా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ స్పందన..

⇨ కేసీఆర్ నిర్ణయమే నాకు శిరోధార్యం
⇨ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా బీఆర్ఎస్‌తోనే ప్రయాణం
⇨ హామీలెన్నో ఉంటాయ్.. అవన్నీ ముఖ్యం కాదు
⇨ మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌తో వైరం లేదు
⇨ ఆయన వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేయడాన్ని ఖండిస్తున్నా
⇨ ఆ ఘటనపై ప్రత్యేక విచారణ జరపాలని కోరుతున్నా
⇨ భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు
⇨ కార్యకర్తలు ఆందోళన చెందొద్దని సూచిస్తున్నా

కందుల సంధ్యారాణి కన్నీటిపర్యంతం..

రామగుండం నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి కన్నీటి పర్యంతమయ్యారు. టికెట్ రాకపోవడంతో తనపై అసభ్యకర కామెంట్స్ పెడుతున్నారని వాపోయారు. అలాంటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మొత్తానికి రామగుండం బీఆర్‌ఎస్ పార్టీలో కూడా లుకలుకలు మొదలయ్యాయి.

ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్ టికెట్ చిరుమర్తి లింగయ్యకు దక్కింది. ఈ స్థానం నుండి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం టిక్కెట్టు ఆశించారు. కానీ చిరుమర్తి లింగయ్యకే కేసీఆర్ టికెట్ కేటాయించారు. దీంతో తన అనుచరులతో సమావేశమైన వీరేశం భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన గత కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని నకిరేకల్ నుంచి పోటీచేయాలని భావిస్తున్నారు. ఇక బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.

publive-image

హైదరాబాద్‌లోని ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి జాబితాలో చోటు దక్కలేదు. ఇక్కడి నుంచి బండారు లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించారు. అయితే ఉప్పల్ అసెంబ్లీ స్థానం నుండి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, సుభాష్ రెడ్డి పోటీ చేయాలని భావించారు. కానీ కేసీఆర్ వీరిద్దరిన కాదని లక్ష్మారెడ్డికి సీటు ఇవ్వడంపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి సుభాష్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

publive-image

అంబర్ పేట అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు టికెట్ కేటాయించడంతో స్థానిక బీఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన ఎడ్ల సుధాకర్ రెడ్డి అయితే ఎన్నికల్లో వెంకటేష్‌కు సహకరించబోమని తేల్చి చెప్పారు. మొత్తానికి అభ్యర్థుల జాబితా గులాబీ పార్టీలో కాక రేపుతోంది. మరి చివరకు ఎంత మంది పార్టీ నుంచి తప్పుకుంటారో వేచి చూడాలి.

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు