Trivikram : కాలి నడకన తిరుమలకు త్రివిక్రమ్.. పవన్ కోసమేనా? టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ తాజాగా శ్రీనివాస్ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఫ్యామిలీతో కలిసి తిరుమల విచ్చేశారు. శ్రీవారి మెట్టు కాలిబాట ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపీ బ్రేక్ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. By Anil Kumar 18 Jun 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Director Trivikram Visits Tirumala With Family : టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ తాజాగా శ్రీనివాస్ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమల చేరుకున్నారు. శ్రీవారి మెట్టు కాలిబాట ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి దర్శనానికి ఫ్యామిలీతో కలిసి వచ్చిన ఆయన.. నిన్న రాత్రి అక్కడే బస చేశారు. ఈ రోజు ఉదయం విఐపీ బ్రేక్ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ సడెన్ గా ఇలా తిరుమల శ్రీవారిని కాలినడకన వచ్చి దర్శించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మాములుగా ఆయన తన సినిమా రిలీజ్ సమయంలో కానీ, సినిమా సక్సెస్ అయ్యాక కానీ తిరుమలకు వస్తుంటాడు. కానీ ఈసారి అవేం లేకుండా రావడంతో దీనిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఎక్కవగా త్రివిక్రమ్ కి మంచి సన్నిహితుడైన పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయిన నేపథ్యంలో త్రివిక్రమ్ తిరుమల సందర్శించారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. Also Read : ‘పుష్ప 2’ ఆఫర్ రిజెక్ట్ చేశారా? విజయ్ సేతుపతి మాస్ ఆన్సర్! పవన్ కోసమే వెళ్లాడా? పవన్ కోసమే అయన కాలి నడకన తిరుమలకు వెళ్లారని చెబుతున్నారు. మరికొందరేమో ఆయన ఫ్యామిలీతో రావడం వవల్ల అది నిజం కాదని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచినా తర్వాత మొదటి సారి త్రివిక్రమ్ ఇలా తిరుమలకు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ఇక త్రివిక్రమ్ ఈ ఏడాది మహేష్ బాబుతో తెరకెక్కించిన 'గుంటూరు కారం' మూవీ ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సన్నద్ధమవుతున్నాడు. #pawan-kalyan #trivikram-srinivas #trivikram-visits-tirumala మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి