RRR మూవీలో అసలు ట్విస్ట్ అదే.. కానీ స్టోరీ మొత్తం మార్చేశాము..! రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

RRR స్పెషల్ స్క్రీనింగ్ కోసం ఇటీవలే జపాన్ వెళ్లిన రాజమౌళి ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. RRR ఒరిజినల్ వెర్షన్ ప్రకారం ఎన్టీఆర్ జోడీగా నటించిన జెన్నీ చనిపోతుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

New Update
RRR మూవీలో అసలు ట్విస్ట్ అదే.. కానీ స్టోరీ మొత్తం మార్చేశాము..! రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

Director Rajamouli About RRR Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన పీరియాడిక్ డ్రామా చిత్రం RRR. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులను సృష్టించింది. ఎన్నో అంతర్జాతీయ వేదికల పై అనేక అవార్డులను సొంతం చేసుకుంది. చలన చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ వేదిక పై కూడా తెలుగు సినిమా సత్తా చాటింది RRR చిత్రం. ఇటీవలే జపాన్ థియేటర్స్ 100 రోజులు విజయవంతంగా ఆడిన చిత్రంగా మరో రికార్డు క్రియేట్ చేసింది.

అయితే తాజాగా RRR స్పెషల్ స్క్రీనింగ్ కోసమని జపాన్ వెళ్లిన రాజమౌళి ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు విషయాలను పంచుకున్నారు. ఎన్టీఆర్ జోడీగా నటించిన జెన్నీ చనిపోతుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read: RGV Movie: ‘నా పెళ్ళాం దెయ్యం’.. వైరలవుతున్న ఆర్జీవీ కొత్త సినిమా పోస్టర్

రాజమౌళి కామెంట్స్

రాజమౌళి మాట్లాడుతూ.. సినిమాలో ఎన్టీఆర్, బ్రిటీష్ యువతీ జెన్నీ( ఒలీవియా మోరీస్) కాంబినేషన్ లో చాలా సీన్స్ ఉన్నాయి. కానీ నిడివి పెరుగుతుందని తీసేయాల్సి వచ్చింది. అంతే కాదు భీమ్ ను జైల్లో పెట్టినప్పుడు జెన్నీ అతడిని కలుస్తుంది. భీమ్ ను జైలు నుంచి తప్పించడానికి సాయం చేయాలనుకుంటుంది. ఈ క్రమంలో ఆమె అంకుల్ గవర్నర్ స్కాట్ గదిలోకి వెళ్లి.. అక్కడ ఉన్న ప్లాన్స్ రహస్యంగా దొంగలించి భీమ్ కు ఇస్తుంది. జెన్నీ తిరిగి వస్తుండగా ఆమె బూట్లకు మట్టి అంటుకోవడం గమనించిన స్కాట్ భార్య అనుమానం వచ్చి.. ఈ విషయాన్ని స్కాట్ కు చెప్తుంది.

publive-image

ఆ తర్వాత జైలు నుంచి తప్పించుకున్న భీమ్, రామ్ కలిసి బ్రిటీష్ సైన్యం పై దాడి చేస్తారు. ఈ క్రమంలో జెన్నీని పావుగా వాడుకొని వాళ్ళను పట్టుకోవాలని ప్లాన్ వేస్తాడు స్కాట్. లొంగకపోతే జెన్నీని చంపేస్తానని చెప్తాడు. రామ్, భీమ్ లొంగిపోయే క్రమంలో.. జెన్నీ మోసం చేసిందని భావించిన స్కాట్ ఆమెను చంపేస్తాడు. ఇది RRR ఒరిజినల్ వెర్షన్. కానీ విషాదంతో కూడిన కథను తీయాలని అనిపించలేదు. అందుకే కథ మొత్తం మార్చేశానని అంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Also Read: Allu Arjun: ఖైరతాబాద్ RTO ఆఫీస్ కు వెళ్లిన అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా..?

Advertisment
Advertisment
తాజా కథనాలు