/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-06T153429.438.jpg)
Prashanth Varma: 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా సెన్సేషన్ గా మారిపోయాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. తొలి సూపర్ హీరో మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. గతేడాది అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
'జై హనుమాన్'
ఇది ఇలా ఉంటే.. ఈ మూవీకి సీక్వెల్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్' తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్ 1 తర్వాత.. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటీ అనే ప్రశ్నకు సమాధానంగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే శ్రీరామ నవమి సందర్భంగా 'జై హనుమాన్' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో రాముడి చేతిలో హనుమంతుడు చేయి వేసి మాటిస్తున్నట్లుగా చూపించారు.
ప్రశాంత్ వర్మ బంపర్ అఫర్
అయితే తాజాగా ఈ మూవీ కోసం ఓ బంపర్ అఫర్ ప్రకటించారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తన సినిమాలో పనిచేయడానికి పోస్టర్ డిజైనర్స్ కావాలంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఆసక్తిగల వ్యక్తులు [email protected] ను సంప్రదించగలరని,ఇది ఫుల్ టైం జాబ్ అని తెలిపారు. 'జై హనుమాన్' చిత్రంలో ఆంజనేయ స్వామి మెయిన్ హీరోగా.. తేజ సజ్జ హనుమంతు పాత్రలో కనిపించనున్నారు. ఆంజనేయ స్వామిగా ఓ స్టార్ హీరో నటించబోతున్నట్లు సమాచారం. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Looking for poster designers. Full time job. Please reach out.. [email protected]
— Prasanth Varma (@PrasanthVarma) June 6, 2024