Bharat-Canada: భారత్ -కెనడా వివాదం..వాటిపై భారీ ఎఫెక్ట్ చూపనుందా? దీంతో ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య వ్యాపార సంబంధాలు కూడా ఇరుకున పడ్డాయి. వచ్చే నెలలో రెండు దేశాల మధ్య జరగాల్సిన ట్రేడ్ మిషన్ కూడా వాయిదా వేస్తున్నట్లు కెనడా వాణిజ్య శాఖ మంత్రి తెలిపారు. ఎటువంటి కారణాలు తెలియజేయకుండానే ఈ చర్చల్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. By Bhavana 22 Sep 2023 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి ఖలిస్తాన్(Khalisthan) టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడా మధ్య చిచ్చు రేపుతోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హత్య వెనక భారత్(Bharat) ప్రమేయముందని..కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో (Trudo) సంచలన ఆరోపణలు చేశారు. భారత్ హస్తముందని ఆరోపించడంతో పాటు తమ దేశంలోని భారత దౌత్యవేత్తను బహిష్కరించారు. దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈ చర్యను ఖండించిన భారత్… కెనడాకు బదులిచ్చింది. భారత్‌లోని కెనడా దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్లు మన విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత్‌కు కెనడా హైకమిషనర్ అయిన కామెరూన్ మెక్‌కేకు విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య వ్యాపార సంబంధాలు కూడా ఇరుకున పడ్డాయి. వచ్చే నెలలో రెండు దేశాల మధ్య జరగాల్సిన ట్రేడ్ మిషన్ కూడా వాయిదా వేస్తున్నట్లు కెనడా వాణిజ్య శాఖ మంత్రి తెలిపారు. ఎటువంటి కారణాలు తెలియజేయకుండానే ఈ చర్చల్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అయితే సెప్టెంబర్ లో జరగాల్సిన ఓ వాణిజ్య ఒప్పందానికి కూడా కెనడా కారణం లేకుండా వాయిదా వేసేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. భారత్ పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకునే దేశాల్లో కెనడా ప్రధాన దేశం. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో పప్పు ధాన్యాల దిగుమతి పై ఆ ప్రభావం 100 శాతం పడే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంలో ఎప్పుడూ కూడా భారత్ ఒక అడుగు ముందే ఉంటుందని ఓ సీనియర్ అధికారి క్లారిటీ ఇచ్చారు. భారత్ ఎప్పుడూ కూడా ఒకే దేశం మీద ఆధారపడదని ఆయన వివరించారు. కెనడా నుంచి వచ్చిన పప్పు ధాన్యాలు ఇప్పటికే చాలా వరకు దేశంలో నిల్వ ఉన్నాయని ఆయన తెలిపారు. దాని వల్ల పప్పు ధాన్యాల కొరత అనేది భారత్ ఉండదని ఆయన తెలిపారు. గత ఏడాది కాలం నుంచి కెనడా నుంచి సుమారు 11 లక్షల టన్నుల పప్పు ధాన్యాలను భారత్ ఇప్పటికే దిగుమతి చేసుకుంది. కెనడా ప్రధాన ఎగుమతిదారుల్లో భారత్ ఫస్ట్. దీంతో ఇప్పుడు ఇతర దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకునేందుకు భారత్ నిర్ణయించింది. ఇప్పటి వరకు కెనడా నుంచి భారత్ 0.95 లక్షల టన్నుల కాయధాన్యాలను దిగుమతి చేసుకోగా, ఆస్ట్రేలియా నుంచి సుమారు 1.99 లక్షల టన్నులను దిగుమతి చేసుకుంది. భారత్ ముందు చూపుగా ఇతర దేశాల నుంచి దిగుమతులను చేసుకుంటుంది కాబట్టి..కెనడా ప్రభావం పప్పు ధాన్యాల మీద పడదని స్పష్టం అవుతుంది. #bharat #canada మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి