Ayodhya: రామ మందిరం థీమ్‌తో నెక్లెస్‌

అయోధ్య రామమందిరం థీమ్‌తో సూర‌త్‌లోని క‌ళాకారులు ఓ డైమండ్ నెక్లెస్‌ తయారు చేశారు. దీని కోసం వారు దాదాపు 5వేల అమెరిక‌న్ వ‌జ్రాలు వాడారు. దాదాపు రెండు కేజీల వెండిని ఉపయోగించి నెక్లెస్‌ రూపుదిద్దారు. 40 మంది కళాకారులు 35 రోజుల పాటు దీనికోసం పనిచేశారు.

New Update
Ayodhya: రామ మందిరం థీమ్‌తో నెక్లెస్‌

Ayodhya: అయోధ్యలో రామమందిర నిర్మాణం కోట్లాదిమంది భక్తుల కల. ఈ నెల 22 నుంచి అక్కడ ఆలయంలో భక్తులకు దర్శనాలూ మొదలు కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఆల‌య థీమ్‌తో సూర‌త్‌లోని క‌ళాకారులు ఓ డైమండ్ నెక్లెస్‌ తయారు చేశారు. దీని కోసం వారు దాదాపు 5వేల అమెరిక‌న్ వ‌జ్రాలు వాడారు. దాదాపు రెండు కేజీల వెండిని ఉపయోగించి నెక్లెస్‌ రూపుదిద్దారు. 40 మంది కళాకారులు 35 రోజుల పాటు దీనికోసం పనిచేశారు. అయితే, ఈ ఆభరణాన్ని అమ్మకం కోసం త‌యారు చేయ‌లేద‌ని, అయోధ్య రామాల‌యానికి కానుకగా దానిని ఇవ్వబోతున్నామని ఆ వ్యాపారి తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు