Dhruv Jurel: ధోనీ రికార్డును సమం చేసిన యువ కీపర్!

యువ కీపర్ ధ్రువ్‌ జురెల్‌ దులీప్‌ ట్రోఫీలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. దులీప్‌ ట్రోఫీలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ పేరిట ఉన్న ఏడు క్యాచ్‌ల రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా B ఘన విజయం సాధించింది.

New Update
Dhruv Jurel: ధోనీ రికార్డును సమం చేసిన యువ కీపర్!

Dhruv Jurel: టీమ్‌ ఇండియా యంగ్ ప్లేయర్ ధ్రువ్‌ జురెల్‌ దులీప్‌ ట్రోఫీలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. బెంగళూరు చిన్నస్వామి మైదానంలో ఇండియా-ఎ తరఫున ఆడిన యువ కీపర్.. దులీప్‌ ట్రోఫీలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ పేరిట ఉన్న ఏడు క్యాచ్‌ల రికార్డును సమం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒకే క్యాచ్‌ పట్టిన ధ్రువ్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురిని ఔట్ చేయడంతో కీలక పాత్ర పోషించి ఈ ఘనత సాధించాడు.

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఇండియా B ఘన విజయం సాధించింది. ఇండియా Aపై 76 పరుగుల తేడాతో గెలిచింది. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా A 198 రన్స్‌కు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (57) ఒక్కడే రాణించాడు. రియాన్‌ పరాగ్ (31), శుభ్‌మన్ గిల్ (21), శివమ్‌ దూబె (14) పరుగులు చేశారు. ఇండియా బి బౌలర్లలో యశ్ దయాల్ 3, ముకేశ్‌ కుమార్ 2, నవదీప్‌ సైని 2, వాషింగ్టన్ సుందర్‌, నితీశ్ రెడ్డి తలో వికెట్ తీశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Chess: ఫిడే మహిళల గ్రాండ్‌ప్రి చెస్‌ టోర్నీ విజేతగా కోనేరు హంపి

ఫిడే వుమెన్ గ్రాండ్ ప్రి చెస్ టోర్నీలో తెలుగు అమ్మాయి కోనేరు హంపి విజేతగా నిలిచింది. పునేలో జరిగిన ఈ చెస్‌ టోర్నీలో చివరి ఆట సమయానికి జు జినర్‌ తో కలిసి ఆమె అగ్రస్థానంలో కొనసాగించినప్పటికీ టై బ్రేక్ లో హంపిని విజేతగా ప్రకటించారు.

New Update
Humpy

humpy

మహారాష్ట్రలోని పూనేలో ఫిడే మహిళల గ్రాండ్ ప్రి చెస్ టోర్నీ ఆసక్తిగా సాగింది. ఇందులో తెలుగు అమ్మాయి. గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి విజేతగా నిలిచింది. అయితే చైనాకు చెందిన జు జినర్ తో కోనేరు హంపి ఈ విజయాన్ని పంచుకుంది.  

టై బ్రేక్ లో విజేతగా..

ఫిడే మహిళల గ్రాండ్‌ ప్రి చెస్‌ టోర్నీలో రెండు ఫైనల్ మ్యాచ్ లు అయ్యాయి. ఒకటి కోనేరు హంపి, బల్గేరియాకు చెందిన నుర్గుయిల్ సలిమోవా ల మధ్యన జరిగితే...మరొకటి చైనా ప్లేయర్ జు చినర్, రష్యా ప్లేయర్ పులినా షువలోవాల మధ్య జరిగింది. ఈ ఫైనల్ పోరులో సలిమోవా పై కోనేరు హంపి 1-0 తేడాతో విజయం సాధించింది. మరోవైపు, జు జినర్‌ సైతం రష్యాకు చెందిన పొలినా షువలోవాపై గెలుపొందింది. దీంతో ఇద్దరూ మొదటి స్థానంతో ముగించినట్లయింది. కానీ మళ్ళీ ఫైనల్ గా  టై బ్రేక్ ఆధారంగా హంపిని టర్నీ విజేతగా ప్రకటించారు. మరో తెలుగమ్మాయి ద్రోణవల్లి హారిక.. ముంగంతూల్ బత్ఖుయాగ్ (మంగోలియా)తో; వైశాలి.. సలోమ్‌ మెలియా (జార్జియా)తో; దివ్య దేశ్‌ముఖ్‌.. ఎలీనా కష్లిన్‌స్కాయా (రష్యా)తో తమ గేమ్‌లను డ్రాగా ముగించారు.   

 today-latest-news-in-telugu | chess | woman | koneru Humpy

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

 

Advertisment
Advertisment
Advertisment