Aravind: RTV తో ఎంపీ అరవింద్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ.. రేవంత్ పొట్టోడు, కవిత క్రిమినల్ అంటూ..!

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కవిత అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ తన గుండుకు పచ్చబోట్లు పొడిపించి, గాడిదపై ఊరేగిస్తాననే వ్యాఖ్యలపై ఆర్టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు.

New Update
Aravind: RTV తో ఎంపీ అరవింద్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ.. రేవంత్ పొట్టోడు, కవిత క్రిమినల్ అంటూ..!

Telangana: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కవిత అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి తన గుండుకు పచ్చబోట్లు పొడిపించి, గాడిదపై ఊరేగిస్తాననే వ్యాఖ్యలపై ఆర్టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు.

బీఆర్ఎస్ పార్టీ మొత్తం దొంగలే..
ఈ మేరకు కవిత అరెస్టు తర్వాత ఎవరి కళ్లు చల్లబడ్డాయనే ప్రశ్నకు బదులిస్తూ.. క్రిమినల్స్ మస్తుగా అరెస్ట్ అవుతారంటూ ఎద్దేవా చేశారు. గతంలో కవిత చెప్పుతో కొడతాననే వ్యాఖ్యలపై మాట్లాడేందుకు ఇష్టపడకపోగా.. పదే పదే ఆమె ఇష్యూతో తనను విసిగించొద్దని అసహనం వ్యక్తం చేశారు. అలాగే కేసీఆర్, బీఆర్ఎస్ నాయకుల తీరు, అవినీతిపై కూడా ఆయన మాట్లాడారు. కవితతోపాటు గతంలో బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి రూ. 800 కోట్ల మక్కల స్కామ్ చేసినట్లు ఆరోపించారు. 25 లక్షల క్వింటాల్లకుపైగా మక్కల అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడ్డాడని, బీఆర్ఎస్ పార్టీ మొత్తం పెద్ద స్కామర్లు ఉన్నారని అన్నారు. అంతేకాదు బ్లాక్ మార్కెట్ లో రైస్ వ్యాపారానికి పాల్పడ్డారన్నారు.

గుండుకు పచ్చబొట్టు, గాడిదపై ఊరేగింపు..
ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటుందని అరవింద్ ఆరోపించారు. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి గుండుకు పచ్చబొట్లు పొడిపించుకుని గాడిదమీద ఊరేగిస్తాం అని గతంలో చేసిన సంచలన వ్యాఖ్యలపై కూడా స్పందించారు. ఆయన నన్ను గుండోడా అంటే.. నేను పొట్టోడా అంటానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని రేవంత్ ఆరోపణలపై రియాక్ట్ అయిన అరవింద్.. రేవంత్ తెలంగాణకు అభద్రత ముఖ్యమంత్రి అంటూ ఎద్దేవా చేశారు. ఒక అసమర్థుడి చేతిలో తెలంగాణ ఉందనే విషయం ప్రజానీకం ఆలోచించాలని చెప్పారు. అలాగే తన విజయానికి ప్రధాన కారణమైన పసుపుబోర్డు ఎప్పుడొస్తుందనే ప్రశ్నలకు సైతం సమాధానం చెప్పలేకపోయారు. పలువురు పసుపు బోర్డ్ ఇష్యూకు సంబంధించిన ప్రశ్నలు అడగగా.. డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు.

ఇక భారత ప్రధాని మోడీ ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ ఇమేజ్ అన్నారు. ఆయన మళ్లీ గెలవాలని దేశం మొత్తం కోరుకుంటుందని, తప్పకుండా బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు