Karnataka: ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి తొలగించే అవకాశం..

కర్ణాటక సెక్స్ స్కాండల్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్నను పార్టీ నుంచి తొలగించనున్నారు. బీజేపీతో అలయెన్స్‌లో ఉన్న పార్టీ దీని మీద ఇవాళ ప్రకటన చేయనుంది. కోర్‌ కమిటీ ప్రజ్వల్ ఇష్యూ మీద తీవ్రంగా చర్చించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

New Update
Karnataka: ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి తొలగించే అవకాశం..

JD(S) MP Prajwal Revanna: సెక్స్ స్కాండల్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ మీద గట్టి దెబ్బే పడేట్టు ఉంది. ఇప్పటికే ఇతని మీద పోలీస్ కేసు నమోదు అయింది. దానికి తోడు ఎలక్షన్స్‌లో పాల్గొనకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఇతన్ని పార్టీ నుంచి కూడా బహిష్కరించనున్నారు. దీని మీద మరి కాసేపటిలో జేడీ(ఎస్) పార్టీ తమనిర్ణయాన్ని ప్రకటించనుంది. ప్రస్తుతం ఈ పార్టీ బీజేపీతో ఎలయెన్స్‌లో ఉంది. ప్రజ్వల్ మీద ఆరోపనలు చాలా బలంగా ఉండడం, దానికి తోడు ఆధారాలు కూడా దొరకడంతో చర్యలు తప్పవనే అంటున్నారు. పార్టీలో అందరూ అతనికి వ్యతిరేకంగానే ఉన్నారు. ఇద్దరు , ముగ్గురు నేతలు పార్టీ అధినేత దేవెగౌడకు దీనికి సంబంధించి లేఖలు కూడా రాశారు.

దేశానికి తిరిగి రప్పిస్తాం..

మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణను ఇండియా తిరిగి రప్పిస్తామని చెబుతోంది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఐపీఎస్‌ బి.కె.సింగ్‌ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంట్లో ఇద్దరు మహిళా ఎస్పీలు కూడా ఉన్నారు. ప్రజ్వల్ సెక్స్ స్కాండల్ కేసులో ప్రభుత్వం జోక్యం చేసుకోదని చెప్పేసింది. ఇక సిట్ టీమ్ వీడియోలకు సంబంధించిన పెన్‌డ్రైవ్‌లను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్‌ విభాగానికి పంపుతారు. మిగిలిన ఆధారాలను సేకరిస్తారు. వీటిల్లో కనుక నిజాలు నిరూపితం అయితే ప్రజ్వల్‌ను సిట్ టీమ్ ఇండియా తీసుకు వస్తుంది. అయితే ఈ కేసును ఏళ్ల ఏళ్ళు సాగదీయకుండా తొందరగా విచారణ జరిగేలా ఆదేశాలు జారీ చేశామని చెప్పారురాష్ట్ర హోంమంత్రి జి.పరమేశ్వర. అంతేకాదు ఈ కేసులో అవసరమైతే బాధితులు, ఫిర్యాదుదారులకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని తెలిపారు.

Also Read:International: హిందూ మహా సముద్రంలో నాలుగు నౌకలపై హౌతీ రెబల్స్ దాడి

Advertisment
Advertisment
తాజా కథనాలు