Devara Movie : 'దేవర' రాకకు నెల రోజులు..స్పెషల్ పోస్టర్ రిలీజ్, డిఫెరెంట్ షేడ్స్ లో తారక్ లుక్స్ వైరల్ By Anil Kumar 27 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Devara Movie : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే పోస్టర్స్, సాంగ్స్ తో సినిమాపై అంచనాలు పెంచిన మేకర్స్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. దేవర రిలీజ్ కు మరో నెల రోజులే ఉందని గుర్తు చేస్తూ ఓ అదిరిపోయే స్పెషల్ పోస్టర్ వదిలారు. అందులో తారక్ కొంచెం నవ్వు.. మరికొంచెం రౌద్రరూపంలో ఉన్నట్లు రెండు డిఫెరెంట్ షేడ్స్ చూపించారు. దానికి 'ది ఫేసెస్ ఆఫ్ ఫియర్' అనే క్యాప్చన్ జోడించారు. అంతేకాకుండా..' ఒక నెలలో బిగ్ స్క్రీన్‌పైకి దేవర రాక.. ఆ అనుభూతి ప్రపంచాన్ని కదిలిస్తుంది. 𝐓𝐇𝐄 𝐅𝐀𝐂𝐄𝐒 𝐎𝐅 𝐅𝐄𝐀𝐑 ‼️ In a month, his arrival will stir up the world with an unmissable big screen experience 🔥🔥 Let’s experience his Majestic Madness in theaters on September 27th ❤️🔥#Devara #DevaraOnSep27th Man of Masses @tarak9999 #KoratalaSiva #SaifAliKhan… pic.twitter.com/UC7ojtMHJo — NTR Arts (@NTRArtsOfficial) August 27, 2024 Also Read : 900 మంది డ్యాన్సర్లతో ‘తండేల్’ సాంగ్.. ఒక్క పాటకే అన్ని కోట్లు పెడుతున్నారా? సెప్టెంబర్ 27న థియేటర్లలో దేవర మ్యాడ్నెస్ని అనుభవిద్దాం'.. అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగారెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. #junior-ntr #devara-movie సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి