Denmark: ఎన్నికల వేళ ప్రధానిపై దాడి.. ఉలిక్కిపడ్డ ప్రజలు

ఐరోపా దేశం డెన్మార్క్‌ ప్రధాని మెటె ఫ్రెడ్రిక్సన్ పై దాడి జరిగింది. కోపెన్‌హాగెన్‌లోని కల్టోర్‌వెట్‌ ప్రాంతంలో ప్రధానిపై ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. భద్రతా సిబ్బంది వెంటనే ఆ దుండగుడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ప్రధాని షాక్‌కు గురయ్యారని ఫ్రెడ్రిక్సన్ కార్యాలయం తెలిపింది.

author-image
By srinivas
New Update
Denmark: ఎన్నికల వేళ ప్రధానిపై దాడి.. ఉలిక్కిపడ్డ ప్రజలు

Mette Frederiksen: ఐరోపాలో ఎన్నికళ వేళ ఊహించని సంఘటన జరిగింది. ఐరోపా దేశం డెన్మార్క్‌ (Denmark) ప్రధాని మెటె ఫ్రెడ్రిక్సన్ (Mette Frederiksen)పై ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. రాజధాని నగరం కోపెన్‌హాగెన్‌లో ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొనగా 'కోపెన్‌హాగెన్‌లోని కల్టోర్‌వెట్‌ ప్రాంతంలో ప్రధానిపై ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. భద్రతా సిబ్బంది వెంటనే ఆ దుండగుడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ప్రధాని షాక్‌కు గురయ్యారు' అని ఫ్రెడ్రిక్సన్ కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది.

ఈ దాడిలో పెద్దగా గాయాలు కాకపోగా.. భద్రతా సిబ్బంది ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం వెలువడలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు