Parliament Security Breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసు.. ఆరు రాష్ట్రాల్లో దర్యాప్తు! ఎక్కడెక్కడంటే? By Trinath 18 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి డిసెంబర్ 13న జరిగిన పార్లమెంట్ దాడి(Parliament Attack) ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. లోక్‌సభ జరుగుతుండగా స్మోక్ స్టిక్స్ పట్టుకోని దుండగులు రావడం.. వారిని ఎంపీలు పట్టుకోవడం.. తర్వాత వారంతా అరెస్ట్ కావడం చకాచకా జరిగిపోయాయి. ఈ దాడిని ప్రతిపక్షాలు, అధికార పక్షం చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. పార్లమెంట్‌పై దాడి అంటే యావత్ దేశంపై దాడి జరిగినట్టుగానే భావిస్తారు. అయితే దండుగల ఉద్దేశం తమను తాము హాని చేసుకోవడంగా తెలుస్తోంది. నిప్పు పెట్టుకునేందుకే లోపలికి వచ్చిన్నట్టు పోలీసుల దర్యాప్తులో ప్రధాన నిందితుడు చెప్పాడు. పార్లమెంట్‌పై దాడికి రెండు, మూడు ప్లాన్లు పెట్టుకున్నామని ప్రధాన నిందితుడు అయిన లలిత్ ఝా పోలీసులకు చెప్పినట్టు సమాచారం. అందులో మొదటిది తమకు తాము నిప్పంటించుకోవడం అని తెలిపాడు. ఇక ఆరుగురు నిందితుల రాష్ట్రాల్లో దర్యాప్తును ముమ్మరం చేసేందుకు ఢిల్లీ పోలీసులు రెడీ అయ్యారు. Also Read: మాకు నిప్పు పెట్టుకుందాం అనుకున్నాం..పార్లమెంటు దాడి ప్రధాన నిందితుడు లలిత్ ఝా ఆరు రాష్ట్రాలకు స్పెషల్ టీమ్‌లు: పార్లమెంట్‌ను కుదిపేసిన భద్రతా ఉల్లంఘనపై ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆరు రాష్ట్రాలైన రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలకు బృందాలను పంపింది. ఈ ఉల్లంఘనకు దారితీసిన ఘటనలపై ఈ బృందాలు నిశితంగా దర్యాప్తు చేస్తున్నాయి. నిందితుల డిజిటల్ పాదముద్రలు, ఆర్థిక రికార్డులు, నేపథ్యాలను పరిశీలించేందుకు 50 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. డీప్ ఇంటరాగేషన్: నిందితుల్లో ఒకరైన సాగర్ శర్మను ప్రస్తుతం సాకేత్ కేంద్రంగా ఉన్న సదరన్ రేంజ్ స్పెషల్ సెల్ బృందం పరిశీలిస్తోంది. ఈ ఉల్లంఘనకు సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝాను సౌత్ వెస్ట్రన్ రేంజ్ లోని స్పెషల్ సెల్‌కు చెందిన జనక్ పురి బృందానికి అప్పగించారు. అటు రాజస్థాన్‌లోని నాగౌర్‌లో ఈ బృందం ఇటీవల నిందితులకు చెందిన కాలిపోయిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. లోధీ రోడ్డులో ఉన్న న్యూఢిల్లీ రేంజ్ స్పెషల్ సెల్ పరిధిలో మరో నిందితుడు మనోరంజన్‌ని ఉంచారు. ఈ బృందం అతడిని క్షుణ్ణంగా విచారించి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా నీలం దేవికి సంబంధించిన దర్యాప్తును న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని స్పెషల్ సెల్ టీం పరిధిలోకి వస్తుంది. ఇది స్పెషల్ సెల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ గా గుర్తింపు పొందింది. ఇక ఇప్పటికే నిందితులందరినీ స్పెషల్ సెల్ లోని ప్రత్యేక విభాగాలకు బదిలీ చేశారు. Also Read: నాగ్‌పూర్‌లో ఘోర ప్రమాదం.. సోలార్ బూస్టర్ ప్లాంట్ పేలి 9మంది మృతి WATCH: #parliament #parliament-attack #parliament-security-breach-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి