Delhi Pollution: ఢిల్లీ ప్రజలకు వాయు కాలుష్య దెబ్బ.. స్కూల్స్ కు రెండురోజుల సెలవు

వాతావరణ కాలుష్యం ఢిల్లీ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. చాలా ప్రాంతాల్లో ఎయిర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 400కు పైగా నమోదైంది.దీంతో రెండు రోజులపాటు స్కూల్స్ కు సెలవులు ప్రకటించారు

New Update
Delhi Pollution: ఢిల్లీ ప్రజలకు వాయు కాలుష్య దెబ్బ.. స్కూల్స్ కు రెండురోజుల సెలవు

Delhi Pollution: వాతావరణ కాలుష్యం ఢిల్లీ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. కొద్దిరోజులుగా అక్కడ గాలి నాణ్యత కు సంబంధించిన ఇండెక్స్ పరిమితికి మించి నమోదు అవుతోంది. అక్కడి గాలి విషతుల్యంగా మారిపోయిందని ఇది సూచిస్తోంది. ఇండియా గేట్, అక్షరధామ్, రోహిణి, ఆనంద్ విహార్ సహా 13 ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 400కు పైగా నమోదైంది. ఏక్యూఐ 300 కంటే ఎక్కువ ఉంటే చాలా ప్రమాదకరమైన కేటగిరీగా పరిగణిస్తారు.

గాలి నాణ్యత క్షీణించడంతో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సిఎక్యూఎం) గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జిఆర్ఎపి) మూడవ దశను ఢిల్లీ-ఎన్సిఆర్లో అమలు చేసింది. 401-450 మధ్య ఏక్యూఐ తీవ్రంగా ఉన్నప్పుడు జీఆర్ఏపీ మూడో దశను వర్తింపజేస్తారు.

దీంతో కొన్ని ప్రాంతాల్లో బీఎస్ 3 పెట్రోల్, బీఎస్ 4 డీజిల్ ఫోర్ వీలర్లపై కఠిన ఆంక్షలు విధించారు. అదే సమయంలో, అత్యవసరం కాని నిర్మాణాలను.. కూల్చివేతలను.. రెస్టారెంట్లలో బొగ్గు వాడకాన్ని నిషేధించారు. శుక్ర, శనివారాల్లో ఐదో తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు.

Also Read: ఇజ్రాయెల్‌పై దాడి ఉగ్రవాద చర్యే.. జైశంకర్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీలో వాయుకాలుష్యం నేపథ్యంలో శ్వాస సంబంధ సమస్యలున్న రోగుల సంఖ్య పెరిగింది. మాస్కులు ధరించి, అవసరమైనప్పుడు మాత్రమే బయటకు రావాల్సిందిగా అక్కడి వైద్యులు ప్రజలకు సూచిస్తున్నారు.

మూడేళ్ల తర్వాత ..
అక్టోబర్ చివరి రోజున రాజధాని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 3 గా నమోదైందని సఫార్ ఇండియా నివేదిక చెబుతోంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డేటా ప్రకారం 3 అక్టోబర్లో ఢిల్లీ సగటు ఏక్యూఐ 327గా నమోదైంది. ఏక్యూఐ 2020 అక్టోబర్లో 257, 2021 అక్టోబర్లో 173గా నమోదైంది.

తక్కువ వర్షాలు, పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఈ పరిస్థితి వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాలుష్యం పెరగడానికి తక్కువ వర్షపాతమే ప్రధాన కారణమని వారంటున్నారు. ఈ ఏడాది అక్టోబరులో ఒక్కరోజులోనే 5.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2022 అక్టోబరులో ఆరు రోజులు 6 మిల్లీమీటర్లు, 129 అక్టోబరులో ఏడు రోజులు 2021 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

పంట వ్యర్థాల దహనం కూడా ఒక ప్రధాన కారణం..
కాలుష్యం పెరగడానికి ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చడం కూడా ఒక ప్రధాన కారణంగా భావిస్తున్నారు. హర్యానా, పంజాబ్ సహా దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో పంట వ్యర్థాల దహనం కొనసాగుతోంది. దీంతో ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, పరిసర ప్రాంతాల్లో గాలిలో పొగమంచు పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 2500కు పైగా పంట వ్యర్థాలను కాల్చిన కేసులు నమోదయ్యాయి. అయితే, గత రెండేళ్లతో పోలిస్తే వ్యవసాయ మంటల సంఖ్య తక్కువగా ఉంది.

లోధీ రోడ్డులో ఏక్యూఐ 438, జహంగీర్పురిలో 491, ఆర్కేపురంలో 486, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 473గా నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తెలిపింది. రాబోయే రోజుల్లో ఢిల్లీ గాలి మరింత దిగజారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు