Delhi: అమ్మాయితో ఆ ఇద్దరు చాటింగ్.. కట్ చేస్తే నడిరోడ్డుపై ఘోరం..!

ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ అమ్మాయితో మాట్లాడుతున్నాడనే కారణంగా మహీర్(20) అనే వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశారు. ఈ కేసులో ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు. యువతి విషయంలో జరిగిన ఘర్షణే ఈ హత్యకు కారణం అని తేల్చారు పోలీసులు.

New Update
Delhi: అమ్మాయితో ఆ ఇద్దరు చాటింగ్.. కట్ చేస్తే నడిరోడ్డుపై ఘోరం..!

New Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని గోకల్‌పురిలో ఘోరం జరిగింది. 20 ఏళ్ల యువకుడిని కొందరు అగంతకులు కత్తితో పొడిచి పొడిచి చంపేశారు. ఇందుకు కారణం.. అతను ఓ అమ్మాయితో మాట్లాడటమేనట. ఇన్‌స్టాగ్రమ్‌(Instagram)లో ఓ అమ్మాయితో మాట్లాడాడని యువకుడిని పొట్టన పెట్టుకున్నారు దుర్మార్గులు. ఇందుఉ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఘజియాబాద్(Ghaziabad) నివాసి అయిన మహీర్ అలియాస్ ఇమ్రాన్.. సెంట్రల్ ఢిల్లీ(Central Delhi)లోని పహార్ గంజ్‌లోని ఫ్లెక్స్ బోర్డు తయారీ దుకాణంలో పని చేసేవాడు. ఈ క్రమంలోనే.. ఇన్‌స్టాగ్రమ్‌లో అతనికి ఓ అమ్మాయి పరిచయమైంది. మహీర్‌తో పాటు అర్మాన్ అనే వ్యక్తికి కూడా ఆ అమ్మాయి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరూ ఆ అమ్మాయితో చాట్ చేయడం, మాట్లాడటం చేసేవారు.

అయితే, ఓ రోజు మహీర్ ఆ అమ్మాయిని కలవడానికి వెళ్లాడు. అయితే, యువతి అర్మాన్‌తో వీడియో కాల్‌లో మాట్లాడటాన్ని గుర్తించాడు. అదిచూసిన మహీర్.. అర్మాన్‌ను దూషించాడు. అతనితో వీడియో కాల్‌లోనే గొడవ పడ్డాడు. ఈ గొడవ అనంతరం కొద్ది రోజుల తరువాత అర్మాన్ ఆ అమ్మాయి మొబైల్ ఫోన్ తీసుకెళ్లాడు. మహీర్‌తో మాట్లాడొద్దని అమ్మాయిని బెదిరించాడు. ఓ రోజు మళ్లీ మహీర్‌కు ఫోన్ చేసిన అర్మాన్.. అమ్మాయి ఫోన్ ఇస్తానని చెప్పి అతడికి ఫోన్ చేశాడు. తాను చెప్పిన ప్లేస్‌కు రావాలని సూచించాడు. దాంతో మహీర్ అతను చెప్పిన ప్లేస్‌కు వెళ్లాడు. అయితే, అప్పటికే పక్కా ప్లాన్‌తో ఉన్న అర్మాన్.. తన స్నేహితులు ఫైసల్, సమీర్‌తో కలిసి కత్తితో పొడిచారు. అతను చనిపోయేంత వరకు పొడిచారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు నిందితులు. భాగీరథి విహార్‌లోని రోడ్డు పక్కన కత్తిపోట్లతో విగత జీవిగా పడి ఉన్న మహీర్‌ను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించి హమీర్‌గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.


సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు.. నిందితులు.. అర్మాన్, ఫైసల్, సమీర్‌లే హమీర్‌ను హత్య చేసినట్లుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అమ్మాయితో మాట్లాడుతున్నందుకే హమీర్‌ను చంపేసినట్లు నిందితులు వెల్లడించారు. కాగా, ఈ ముగ్గురు యువకులు గోకల్‌పురిలో పార్ట్‌టైమ్ వర్క్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

అభయహస్తం అప్లికేషన్‌పై అనేక సందేహాలు.. సమాధానం ఏది?!

పక్కా వ్యూహంతో బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు సాధించేనా?!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Himachal Pradesh Accident : పెళ్లింట తీవ్ర విషాదం.. కారు లోయలో పడి ఐదుగురి మృతి

పెళ్లింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదుపు తప్పి కారు లోయలో పడటంతో ఐదుగురి మృతి చెందారు. ఈ దుర్ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో పాండో ఆనకట్ట సమీపంలోని బఖ్లి రోడ్డుపై జరిగింది. మృతుల్లో ఎనిమిది నెలల చిన్నారి కూడా ఉన్నాడు.  

New Update
HP accident

HP accident

పెళ్లింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదుపు తప్పి కారు లోయలో పడటంతో ఐదుగురి మృతి చెందారు. ఈ దుర్ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో పాండో ఆనకట్ట సమీపంలోని బఖ్లి రోడ్డుపై జరిగింది. మృతుల్లో ఎనిమిది నెలల చిన్నారి కూడా ఉన్నాడు.  

తమ్ముడి వివాహం అయిపోయాక 

మృతులను చాచియోట్ తహసీల్‌లోని తరౌర్ గ్రామానికి చెందిన రమేష్ చంద్ కుమారుడు దునిచంద్ (33), తరౌర్ గ్రామానికి చెందిన దునిచంద్ భార్య కాంతా దేవి (28), వారి కుమార్తె కింజల్ (8 నెలలు), చాచియోట్ తహసీల్‌లోని నౌన్ గ్రామానికి చెందిన థాలియా రామ్ కుమారుడు దహ్లు రామ్ (52), నేపాల్ నివాసి మీనా దేవి (30)గా గుర్తించారు. దునిచాంద్ తమ్ముడి వివాహం అయిపోయిన తరువాత కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.  

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, పాండో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం, SDRF, CISF, పాండో అవుట్‌పోస్ట్ బృందాలు మృతదేహాలను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నాయి

Advertisment
Advertisment
Advertisment