Kejriwal Arrest🔴: కేజ్రీవాల్‌ అరెస్ట్‌.. లైవ్‌ అప్‌డేట్స్‌!

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడం సంచలనం రేపింది. కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై ఆర్టీవీ మినిట్‌ టు మినిట్‌ అప్‌డేట్‌ అందిస్తోంది.

New Update
Kejriwal Arrest🔴: కేజ్రీవాల్‌ అరెస్ట్‌.. లైవ్‌ అప్‌డేట్స్‌!

తీగలాగితే డొంక కదిలినట్లు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంకేసు ధర్యాప్తులో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై రాజకీయ వర్గాల్లో సెగ చల్లారకముందే ఏకంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అదుపులోకి తీసుకోవడం ప్రకంపనలు రేపింది. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత AAPకి కాంగ్రెస్ మద్దతిస్తోంది.. మరోవైపు కేజ్రీవాల్‌ అరెస్ట్‌కు బీజేపీ డిమాండ్‌ చేస్తోంది.

  • Mar 22, 2024 14:52 IST
    కేజ్రీవాల్‌ అరెస్టుపై రౌస్‌ అవెన్యూ కోర్టులో వాడివేడి వాదనలు

    -- కేజ్రీవాల్‌ తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ అడ్వకేట్‌ అభిషేక్‌ మను సింఘ్వి
    -- ఈడీ తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, ASG రాజు



  • Mar 22, 2024 14:37 IST
    పది రోజుల కస్టడీ కోరుతూ ఈడీ పిటిషన్



  • Mar 22, 2024 14:35 IST
    రౌస్‌ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను హాజరుపరిచిన ఈడీ



  • Mar 22, 2024 14:27 IST
    'నాతో కలిసి పనిచేసి, మద్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు లిక్కర్ పాలసీలో అవినీతి చేస్తున్నందుకు తాను చాలా బాధపడ్డాను. ఆయన చేష్టల వల్లే ఆయన అరెస్ట్.. అయితే ఏం చేస్తాడు.. అధికారం ముందు ఏదీ పనికిరాదు. అరెస్టు జరిగింది, ఇప్పుడు చట్టం ప్రకారం ఏది జరుగుతుందో అదే జరుగుతుంది.' - అన్నా హజారే



  • Mar 22, 2024 12:36 IST
    కేజ్రీవాల్‌ సంచలన నిర్ణయం.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ ఉపసంహరణ!


  • Mar 22, 2024 11:07 IST
    ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు



  • Mar 22, 2024 11:04 IST
    ట్రయల్ కోర్టులోనే బెయిల్ అప్లయ్ చేసుకోవాలని కవితకు చెప్పిన సుప్రీం కోర్టు



  • Mar 22, 2024 10:43 IST
    ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ నిరాకరణ



  • Mar 22, 2024 10:41 IST
    కవిత, కేజ్రీవాల్ ని కలిపి విచారించనున్న ఈడీ



  • Mar 22, 2024 10:24 IST
    కేజ్రీవాల్‌ అరెస్ట్‌ బీజేపీ రాజకీయ కుట్ర: అతిషి



  • Mar 22, 2024 10:17 IST
    ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీని ఈడీ నిందితుడిగా పేర్కొనే ఛాన్స్



  • Mar 22, 2024 10:03 IST
    ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వెలుపల భద్రతను పెంపు.. సెక్షన్ 144 విధింపు



  • Mar 22, 2024 10:02 IST
    కేజ్రీవాల్ అరెస్టు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే: కపిల్ సిబల్



  • Mar 22, 2024 09:57 IST
    కేజ్రీవాల్ అరెస్టు నిరంకుశత్వం: మాణికం ఠాగూర్



  • Mar 22, 2024 09:54 IST
    ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వాదనలు వినబోతున్న సీజీఐ చంద్రచూడ్



  • Mar 22, 2024 09:52 IST
    అరవింద్ కేజ్రీవాల్ ఇంటి బయట నిరసన తెలిపినందుకు ఆప్ ఎమ్మెల్యే రాఖీ బిర్లాను అదుపులోకి తీసుకున్న పోలీసులు



  • Mar 22, 2024 09:52 IST
    అరవింద్ కేజ్రీవాల్ భద్రతపై ఆప్‌ నేత అతిషి ఆందోళన



  • Mar 22, 2024 09:34 IST
    ఈడీ లాకప్ లో కేజ్రీవాల్‌ను నిన్న రాత్రి నిద్రపోలేకపోయారు: అధికారులు



  • Mar 22, 2024 09:28 IST
    ఈడీ, రౌస్ అవెన్యూ కోర్టు వద్ద భారీ భద్రత



  • Mar 22, 2024 09:17 IST
    బీజేపీ కార్యాలయం వెలుపల ఆప్ నిరసన పిలుపు తర్వాత ఢిల్లీ ట్రాఫిక్ పోలీసుల సలహా



  • Mar 22, 2024 09:05 IST
    కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చేరుకున్న వైద్యుల బృందం



  • Mar 22, 2024 08:59 IST
    ఢిల్లీ మెట్ర ITO మెట్రో స్టేషన్ ఈరోజు ఉదయం 08 నుండి సాయంత్రం 06 గంటల వరకు మూసివేయాలని నిర్ణయం



  • Mar 22, 2024 08:51 IST
    కేజ్రీవాల్ ను పది రోజుల కస్టడి కోరనున్న ఈడీ



  • Mar 22, 2024 08:45 IST
    సీఎం పదవిలో ఉండగా అరెస్ట్‌ అయిన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌!


  • Mar 22, 2024 08:33 IST
    రాజ్యాంగంలో సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్టు చేసే నిబంధన ఏదీ లేదు: న్యాయవాది అశ్వనీ కుమార్ దూబే



  • Mar 22, 2024 08:26 IST
    అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ బీజేపీకి ఈ ఫార్మా సంస్థ ఎలక్టోరల్ బాండ్ విరాళాలతో ముడిపడి ఉంది: నివేదిక



  • Mar 22, 2024 08:22 IST
    వైద్య పరీక్షల అనంతరం కేజ్రీవాల్ ను కోర్టులో ప్రవేశపెట్టనున్న ఈడీ



  • Mar 22, 2024 08:16 IST
    ఈ అరెస్ట్ కొత్త ప్రజా విప్లవానికి జన్మనిస్తుంది: అఖిలేష్ యాదవ్



  • Mar 22, 2024 08:11 IST
    ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడిందని ప్రియాంక గాంధీ ఆగ్రహం


  • Mar 22, 2024 08:06 IST
    అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో తెరవెనుక పెద్ద పాత్ర పోషించిన కేజ్రీవాల్


  • Mar 22, 2024 08:00 IST
    సిట్టింగ్ సీఎంను దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి


  • Mar 22, 2024 07:50 IST
    ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం వెలుపల భద్రతను కట్టుదిట్టం



  • Mar 22, 2024 07:45 IST
    11గంటలకు రౌస్ అవెన్యూ కోర్టుకు కేజ్రీవాల్



  • Mar 22, 2024 07:40 IST
    కాసేపట్లో కోర్ట్ ముందుకు కేజ్రీవాల్



  • Mar 22, 2024 07:35 IST
    కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై ఆమ్‌ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా ఇవాళ నిరసన ప్రకటన



  • Mar 22, 2024 07:25 IST
    చట్టపరమైన సహాయం అందించేందుకు రాహుల్ గాంధీ కేజ్రీవాల్ కుటుంబాన్ని కలవనున్నారు: సోర్సెస్



  • Mar 22, 2024 07:18 IST
    ఢల్లీలో రెండంచెల భద్రతా వలయం, నిఘా కోసం డ్రోన్లు



  • Mar 22, 2024 07:00 IST
    కేజ్రీవాల్ అరెస్టును ఖండించిన కేటీఆర్



  • Mar 22, 2024 06:34 IST
    భారత్‌లో అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది: రాఘవ్ చద్దా



  • Mar 22, 2024 06:17 IST
    2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 95% ED కేసులు ఆప్ నేతలపైనే ఉన్నాయి



  • Mar 22, 2024 00:00 IST
    ఎక్సైజ్ కేసులో కేజ్రీవాల్ పాత్రపై ED దావా



  • Mar 21, 2024 23:46 IST
    ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రధాన కార్యాలయానికి చేరుకున్న వైద్య బృందం



  • Mar 21, 2024 23:45 IST
    లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అరెస్టు చేసిన మొదటి సిట్టింగ్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్



  • Mar 21, 2024 23:22 IST
    కేజ్రీవాల్ ఇంట్లో కేవలం రూ.70వేలు దొరికాయి: ఆప్ లీడర్ సౌరభ్ భరద్వాజ్



  • Mar 21, 2024 22:35 IST
    కేజ్రీవాల్ అరెస్ట్ ను ఖండించిన శరద్ పవార్



  • Mar 21, 2024 22:25 IST
    కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా?


  • Mar 21, 2024 22:20 IST
    లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఇది కక్షసాధింపు రాజకీయమే: టీఎంసీ నేత కునాల్ ఘోష్



  • Mar 21, 2024 22:10 IST
    ముఖ్యమంత్రుల అరెస్టులు కూడా సర్వసాధారణమైపోయాయి. దీనికి భారత్ ధీటైన సమాధానం ఇస్తుంది- రాహుల్ గాంధీ



  • Mar 21, 2024 22:00 IST
    కేజ్రీవాల్ తక్షణమే రాజీనామా చేయాలి: సీఎం అరెస్టుపై ఢిల్లీ బీజేపీ చీఫ్



  • Mar 21, 2024 21:57 IST
    నన్ను బలవంతంగా నిర్బంధించారు, అవమానించారు..' అని ఆప్ నేత రాఖీ బిర్లా ఆరోపణలు



Advertisment
Advertisment
తాజా కథనాలు