MLC Kavitha: కవితకు ఇంటి భోజనం ఇవ్వాలని ఆదేశించిన కోర్టు

తీహార్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఇంటి భోజనంతో సహా.. పుస్తకాలు, పెన్నులు, జపమాలకు అనుమతివ్వాలని రౌస్ అవెన్యూ కోర్టు అధికారులకు మరోసారి ఆదేశాలిచ్చింది. అలాగే భోజనం, పరుపు, దుప్పట్లు తెచ్చుకునేందుకు, ఆభరణాలు ధరించేందుకు కూడా పర్మిషన్ ఇవ్వాలని చెప్పింది.

New Update
MLC Kavitha: కవితకు ఇంటి భోజనం ఇవ్వాలని ఆదేశించిన కోర్టు

Court Ordered to Give Home Meals to Kavitha: ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్‌ జైలులో (Tihar Jail) ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు అవసరమైన వసతులు కల్పించాలని రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) జైలు అధికారులకు మళ్లీ ఆదేశాలు జారీ చేసింది. కొన్ని వస్తువులను పొందేందుకు అవకాశం ఇచ్చింది. పుస్తకాలు, పెన్నులు, జపమాలతో పాటు ఇతర వస్తువుల అనుమతికి ఆదేశించింది. అలాగే ఇంటి నుంచి భోజనం, పరుపు, దుప్పట్లు తెచ్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. అంతేకాదు ఆభరణాలు ధరించేందుకు, లేసులు లేని బూట్లు వేసేందుకు కూడా అనుమతించాలని అధికారలకు ఆదేశాలు జారీ చేసింది.

Also Read: కాంగ్రెస్‌లో చేరిన కడియంకు షాక్‌.. రాజీనామా చేస్తేనే టికెట్‌

అయితే మార్చి 26న కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఒక్కదానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదని.. ఆమె తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఉత్తర్వుల్లో ఇచ్చిన అన్నింటినీ తెచ్చుకునేందుకు తాము అనుమతి ఇచ్చామని జైలు సూపరింటెండెట్‌ కోర్టుకు చెప్పారు. అయితే తాజాగా కవితకు ఇంటి భోజనానికి జైలు అధికారులు అనుమతి ఇవ్వడం లేదని.. ఆమె తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు జైలు నిబంధనల ప్రకారం ఇంటి భోజనం అందించడానికి అనుమతి లేదని జైలు అధికారి కోర్టుకు తెలిపారు. దీన్ని పరిగణలోకి తీసుకుంటామని న్యాయస్థానం చెప్పింది. అయితే తాజాగా ఆమెకు ఇంటి భోజనంతో సహా.. మరికొన్ని వస్తువులు ఇచ్చేందుకు అనుమతివ్వాలని అధికారులకు ఆదేశించింది.

ఇదిలాఉండగా.. మద్యం విధానం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో.. మార్చి 15వ తేదీన ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసం ప్రాంతంలో ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టాక.. ఏప్రిల్ 9 వరకు కోర్టు జ్యూడిషల్ కస్టడీకి విధించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు