Kejriwal: నేను హాజరు కాను..వెంటనే సమన్లు వెనక్కి తీసుకోండి: కేజ్రీవాల్‌!

మద్యం కుంభకోణం కేసులో గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉండగా..తాను హాజరు కావడం లేదని కేజ్రీవాల్ తెలిపారు. తనకు ఇచ్చిన సమన్లు కూడా వెంటనే వాపస్‌ తీసుకోవాలని ఆయన ఈడీకి లేఖ పంపించారు

New Update
Kejriwal: కేజ్రీవాల్‌కు దక్కని ఊరట..ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

మద్యం కుంభకోణం (Liquorscam) కేసులో గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌(Kejriwal)  ఈడీ (Ed) ముందుకు హాజరు కావాల్సి ఉండగా..తాను హాజరు కావడం లేదని కేజ్రీవాల్ తెలిపారు. తనకు ఇచ్చిన సమన్లు కూడా వెంటనే వాపస్‌ తీసుకోవాలని ఆయన ఈడీకి లేఖ పంపించారు. ఆ నోటీసులు పూర్తిగా కక్ష సాధింపు చర్యే అని ఆయన ఆరోపించారు.

పూర్తిగా రాజకీయ కక్షతో చట్టవిరుద్దంగా జారీ చేసిన నోటీసులుగా ఆయన అభివర్ణించారు. ఇదంతా కూడా బీజేపీనే కావాలని చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేజ్రీవాల్ డిమాండ్‌ చేశారు. అసలు అయితే గురువారం ఉదయం ఈడీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. .

ఈ క్రమంలో ఆయనకు సమన్లు జారీ చేయడాన్ని ఆయనతో పాటు పార్టీ మంత్రులు కూడా వ్యతిరేకించారు. దీంతో ఈడీ కార్యాలయం ముందు ఎటువంటి నిరసనలు జరగకుండా అధికారులు ముందుగానే భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఈడీ ఆఫీసు వద్ద భారీగా బారీకేడ్లను ఉంచారు.

పోలీసులతో పాటు పారా మిలటరీ బలగాలు కూడా భారీగా మోహరించాయి. దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ మార్గ్‌ లోని బీజేపీ కేంద్ర కార్యాలయం , ఐటీఓ ప్రాంతాల్లోని ఆప్‌ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో కొన్ని ప్రదేశాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉంటే రాజ్‌ఘాట్‌ వద్ద నివాళి ఆర్పించేందుకు కేజ్రీవాల్ వెళ్లనున్నారన్న సమాచారం ఉంది. దీంతో ఆ ప్రదేశాల్లో భద్రతను పెంచారు.

ఈ ఏడాది ఏప్రిల్‌ లో మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ ను సీబీఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ఫిబ్రవరిలో అరెస్ట్‌ కాగా..ఆయన పలుసార్లు బెయిల్‌ కు ప్రయత్నించగా అవి విఫలం అయ్యాయి. ఇటీవల సుప్రీం కోర్టు సైతం ఆయన బెయిల్ పిటిషన్‌ ను తిరస్కరించింది.

ఢిల్లీ నూతన మద్యం విధానంలో రూ. 338 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఢిల్లీ మద్యం విధానం 2021-22ని రూపొందించే క్రమం, అమలు సమయంలో ముఖ్యమంత్రిగా, ఆప్‌ అధినేతగా కేజ్రీవాల్‌ను నిందితులు సంప్రదించారని ఈడీ తన ఛార్జిషీటులో పేర్కొంది.

Also read: రాజకీయాల్లో డబుల్‌ యాక్షన్‌ కుదరదు..ఏదో ఒక్క దానికే…!

Also read: కానిస్టేబుల్ భార్యతో సీఐ రిలేషన్‌..మర్మంగాలు కోసేసిన!

Advertisment
Advertisment
తాజా కథనాలు